Rajapaksa Resign : శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా

మహీంద రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు. నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు.

Rajapaksa Resign : శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా

Mahindra Rajapaksa

Rajapaksa resign : శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రజా నిరసనకు తలొగ్గిన రాజపక్స..సోమవారం(మే9,2022) తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అస్తవ్యస్త విధానాలతో రాజపక్స కుటుంబం శ్రీలంకను ముంచేశారు.

మహీంద రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు. నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద్ర రాజపక్స పీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

 

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చినప్పటికీ, పదవులకు రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్లను రాజపక్సే సోదరులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాన మంత్రి మహీంద్రా రాజపక్స ధిక్కరిస్తూ వస్తున్నారు.

సోమవారం మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగడానికి ప్రతిపాదన చేయవచ్చనే వార్తల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స కార్యాలయం వెలుపల హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ అనుకూల వర్గాలు నిరసనకారులపై దాడి చేశాయి. ఈ హింసాకాండలో 20 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాజధానిలో భారీగా సైన్యాన్ని మోహరించింది.