Sri Lanka’s deposed president: శ్రీలంకలో అడుగుపెట్టిన గొటబాయ రాజపక్స… మళ్ళీ ఆందోళనలు షురూ

గొటబాయ రాజపక్స థాయిలాండ్ లోని ఓ హోటల్ నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకున్నారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయ రాజపక్సకు శ్రీలంక ప్రభుత్వం భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాగా, జూలై రెండో వారంలో శ్రీలంకలో ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్ళడంతో 13వ తేదీన గొటబాయ రాజపక్స దేశం వదిలి మాల్దీవులకు పారిపోయారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా రణీల్‌ విక్రమసింఘే బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

Sri Lanka’s deposed president: శ్రీలంకలో అడుగుపెట్టిన గొటబాయ రాజపక్స… మళ్ళీ ఆందోళనలు షురూ

Sri Lanka’s deposed president

Sri Lanka’s deposed president: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని దేశం వదిలి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ఆ దేశానికి చేరుకున్నారు. శ్రీలంకలో భారీ నిరసనల వల్ల కొన్ని వారాల క్రితం ఆయన దేశం వదిలి మొదట మాల్దీవులు, అనంతరం సింగపూర్, థాయిలాండ్ కు ఆయన పారిపోయిన విషయం తెలిసిందే. గొటబాయ రాజపక్స శనివారం తిరిగి శ్రీలంక రానున్నట్లు ఆ దేశంలోని ఓ రక్షణ శాఖ అధికారి రెండు రోజుల క్రితమే మీడియాకు తెలిపారు.

ఆయన చెప్పినట్లే గొటబాయ రాజపక్స థాయిలాండ్ లోని ఓ హోటల్ నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకున్నారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయ రాజపక్సకు శ్రీలంక ప్రభుత్వం భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాగా, జూలై రెండో వారంలో శ్రీలంకలో ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్ళడంతో 13వ తేదీన గొటబాయ రాజపక్స దేశం వదిలి మాల్దీవులకు పారిపోయారు.

ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా రణీల్‌ విక్రమసింఘే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. గొటబాయ రాజపక్స శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మళ్ళీ ఆయన శ్రీలంకకు రావడంతో ఆందోళనకారులు మరోసారి ప్రారంభమయ్యాయి.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం