Zelensky : వాటే స్పీచ్.. జెలెన్‌స్కీ ప్రసంగానికి చప్పట్లతో మార్మోగిన ఈయూ పార్లమెంట్

రష్యా దాడులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) మరోసారి మండిపడ్డారు. ఈయూ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

Zelensky : వాటే స్పీచ్.. జెలెన్‌స్కీ ప్రసంగానికి చప్పట్లతో మార్మోగిన ఈయూ పార్లమెంట్

Zelensky (1)

Zelensky : రష్యా దాడులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి మండిపడ్డారు. ఈయూ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అత్యంత దారుణమైన, హేయమైన రాక్షసత్వానికి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి సాధారణ పౌరులపై రష్యా బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై రష్యా సేనల కాల్పులకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు.

యుక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ లో పౌరుల ఇళ్లపై జరిగిన దాడులను జెలెన్ స్కీ(Zelensky) ఈయూకి వివరించారు. రష్యా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. వెంటనే దాడులను ఆపాలని రష్యాను డిమాండ్ చేశారాయన. ఈయూ తమ చేయి వదలడం లేదని, యుక్రెయిన్ కు అండగా ఈయూ ఉందని నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం అని జెలెన్ స్కీ చెప్పారు.

Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

చివరగా తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ నేల, స్వేచ్చ కోసం పోరాటం చేస్తున్నామన్న జెలెన్ స్కీ.. తమను ఎవరూ విచ్చిన్నం చేయలేరని స్పష్టం చేశారు. జెలెన్ స్కీ ప్రసంగానికి ఈయూ పార్లమెంటు సభ్యులు మంత్రముగ్దులయ్యారు. జెలెన్ స్కీ ప్రసంగం ముగిశాఖ ఈయూ పార్లమెంటు చప్పట్లతో మార్మోగింది. ఈయూ పార్లమెంటు సభ్యులు జెలెన్ స్కీ కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. యుక్రెయిన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈయూ పార్లమెంటు అధ్యక్షురాలు భరోసా ఇచ్చింది.

వరుసగా 6వ రోజు(మార్చి 1) కూడా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. రష్యా చెలరేగిపోతోంది. మరింత దూకుడు పెంచింది. దాడులను ఉధృతం చేసింది. దీంతో యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

ఓవైపు బెలారస్‌ వేదికగా చర్చలకు రావాలని పిలుపునిస్తూనే.. మరోవైపు యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను చుట్టుముట్టింది రష్యా. రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్‌కు శివారులోనే ఇప్పటిదాకా ఉన్న సైన్యం తాజాగా.. నగరంలోకి అడుగు పెట్టే దిశగా కదిలింది. అయితే రష్యా సైన్యానికి యుక్రెయిన్‌ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నగరంలోకి అడుగు పెట్టకుండా బలగాలు ఎదురొడ్డి నిలిచాయి. మరోవైపు రాజధాని నగరం కీవ్‌లోనూ యుక్రెయిన్‌ సైన్యం, పౌరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా తమ లక్ష్యాన్ని వైమానిక స్థావరాలు, ఇంధన వనరుల వైపు మళ్లించింది. తెల్లవారుజామున ఆకాశంలో బాంబుల మోత వినిపించడంతో కీవ్‌ నగరంలోని ప్రజలు తమ ఇళ్ల బేస్‌మెంట్లు, గ్యారేజీలు,
సబ్‌వే స్టేష్టన్లలోకి వెళ్లి తల దాచుకున్నారు. తూర్పు ఖార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌నూ రష్యా పేల్చేసింది.

యుక్రెయిన్ పై యుద్ధం గురించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. ల‌క్ష్యం చేరేదాకా వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌కట‌న చేసింది. ర‌ష్యా నిర్దేశించుకున్న‌ల‌క్ష్యం నెర‌వేరే దాకా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేదే లేద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే వరకు ర‌ష్యా సాయుధ ద‌ళాలు ప్ర‌త్యేక సైనిక చ‌ర్య‌ను కొన‌సాగిస్తాయ‌న్నారు.