ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 06:13 AM IST
ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది

ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీని బారి నుంచి బయటపడాలంటే..వ్యాక్సిన్ తప్పనిసరి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.



మందు ఎప్పుడెస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరణాల సంఖ్య రోజు రోజుకు అధికమౌతుండడం అందర్నీ భయపెడుతోంది. కానీ…ఓ రకం స్టెరాయిడ్స్ వాడడం వల్ల మరణాల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
https://10tv.in/key-decision-on-liquor-in-andra-prasdesh/
యూకే ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనం వెల్లడిస్తోంది. రికవరీ పెంచుకోవాలంటే..డెక్సా మెథాసోన్ (Dexamethasone) స్టెరాయిడ్ వాడాల్సి ఉంటుందని యూకే పరిశోధకులు వెల్లడిస్తున్నారు. Imperial College London కు చెందిన Professor Anthony Gordon నాయకత్వం వహించారు. 88 ఆసుపత్రులపై అధ్యయనం చేశారు.



కరోనా బారిన పడిన వారిపై ఈ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల వారు రికవరీ అవుతున్నారని పేర్కొంటున్నారు. కరోనా రోగుల మరణాల రేటు మూడింట ఒక వంతు తగ్గిందని తెలిపారు. ఏడు అంతర్జాతీయ ట్రయల్స్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పరిశోధకులు ప్రకటించారు.

సీరియస్ గా రోగులపై ప్రయోగాలు జరిపారు. డెక్సా మెథాసోన్ (Dexamethasone) వాడిన తర్వాత, వెంటిలెటర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల మరణాల రేటు 60 నుంచి 68 శాతం తగ్గిందన్నారు. ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్న వ్యక్తుల మరణాల రేటును 20 శాతం తగ్గినట్లు గుర్తించడం జరిగిందన్నారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్న రోగుల కాపాడేందుకు ఈ మందు చక్కగా ఉపయోగపడుతుందని స్పష్టంగా చెబుతున్నారు. క్రిటికల్ కండీషన్ లో ఉన్న సమయంలోనే స్టెరాయిడ్ వాడాలని WHO సూచిస్తోంది.