Strange Fish : వింత చేప.. మనుషుల మాదిరిగా దంతాలు

అమెరికాలో ఒక వింత చేప దొరికింది. ఈ చేపకు మనుషుల మాదిరిగా దంతాలు ఉన్నాయి. నార్త్ కరోలినా తీరంలోని చేపల స్థావరమైన నాగ్స్ హెడ్ లో 9 పౌండ్ల బరువు ఉన్న ఈ వింత చేప లభించింది.

Strange Fish : వింత చేప.. మనుషుల మాదిరిగా దంతాలు

Fish

Strange fish in America : అమెరికాలో ఒక వింత చేప దొరికింది. ఈ చేపకు మనుషుల మాదిరిగా దంతాలు ఉన్నాయి. నార్త్ కరోలినా తీరంలోని చేపల స్థావరమైన నాగ్స్ హెడ్ లో 9 పౌండ్ల బరువు ఉన్న ఈ వింత చేప లభించింది. దీనికి మానవుల వంటి పళ్లు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గొర్రే నోటిని పోలిన దీన్ని షైప్స్ హెడ్ ఫిష్ గా గుర్తించారు.

దాని నోట్లో అనేక పళ్ల వరుసలు ఉన్నాయి. గుల్లలు, నత్తలు వంటి వాటిని పళ్లతో అది నమిలి తింటుంది. షీప్స్ హెడ్ చేపలు సాధారణంగా రాళ్లు, జెట్టీలు, దిబ్బలు, వంతెనల వద్ద కనిపిస్తాయి. నలుపు, తెలుపు చారలు ఉండటంతో వాటిని కన్ విక్ట్ ఫిష్ గా పిలుస్తారు.

అయితే కట్టుడు పళ్లలాంటి దంతాలున్న వింత చేప ఫొటోను జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. బిగ్ తీత్ బిగ్ టైమ్స్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఈ వింత చేప ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.