COVID-19 ఊపిరితిత్తుల మీదే కాదు బ్రెయిన్ పైనా ఎఫెక్ట్

  • Published By: Subhan ,Published On : June 26, 2020 / 09:31 AM IST
COVID-19 ఊపిరితిత్తుల మీదే కాదు బ్రెయిన్ పైనా ఎఫెక్ట్

COVID-19 కేసులు పెరుగుతున్న కొద్దీ డాక్టర్లలో అలర్ట్ ఎక్కువవుతోంది. దీనిపై రీసెర్చ్ చేస్తుంటే షాక్ అయ్యే నిజాలు బయటికొస్తున్నాయి. కరోనా కారణంగా జబ్బుపడి స్టోక్స్, కన్ఫ్యూజన్, సైకోసిస్ లకు గురై 125మంది హాస్పిటల్ పాలైయ్యారట. దాని వెనుక కారణం SARS-CoV-2యేనని నిపుణులు అంటున్నారు. న్యూరలాజికల్ లక్షణాలు సాధారణ ప్రజలపై ఎలా ప్రభావం చూపుతాయోనని స్టడీ చేశారు. 

ఇప్పటికీ వాటి గురించి అనుమానస్పదంగానే మిగిలాయి అనుమానాలు. కొవిడ్ 19 పేషెంట్లలో కొందరిలో మాత్రమే ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా అరుదు కానీ, చాలా కాంప్లికేషన్స్ తో కూడుకున్నవ. అని బెనెడిక్ట్ మైకేల్, లివర్ పూల్ యూనివర్సిటీ న్యూరాలజిస్ట్ అంటున్నారు. న్యూరాలజిస్టులు, స్ట్రోక్ ఫిజిషియన్లు, సైక్రియాట్రిస్టులు, ఇతర డాక్టర్లు సర్వేలోని డేటా బేస్ ను సెంట్రలైజ్ చేశారు. 

125మంది పేషెంట్లపై చేసిన సర్వేలో 77మంది బ్రెయిన్ బ్లడ్ ఫ్లోలో తేడాలు ఉన్నట్లు గమనించారు. చాలా వరకూ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. కొవిడ్ 19 కాంప్లికేషన్ కారణంగా బ్లడ్ క్లాట్ లు రావడం గమనించినా.. తక్కువ వయస్సున్న వారిలో అది స్ట్రోక్ లకు దారితీస్తున్నట్లు తెలిసింది. 

125మంది పేషెంట్లు మానసిక స్థితి మార్చేసుకున్నారు. కన్ఫ్యూజన్, పర్సనాలిటీలో మార్పులు, డిప్రెషన్ వంటి లక్షణాల్లో తేడాలు గుర్తించారు. 60ఏళ్లు కంటే తక్కువ వయస్సున్న 18/37మంది మానసిక స్థితులు మారిపోయాయి. వీరిలో మార్పులు గమనించారు కానీ, కచ్చితంగా వైరస్ అనేది బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపుతుందా అని నిర్థారించలేకపోతున్నారు. 

Read: స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు భారీగా తగ్గిపోయింది