పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 12:46 PM IST
పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగా గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పంజాబ్,ఖైబర్,పత్తున్ ఖ్వా లో కూడా భూకపం ప్రభావం అధికంగానే ఉంది. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. లాహోర్,పెషావర్,రావల్పిండిలో ఇళ్లలో నుంచి జనం భయంతో పరుగులు తీశారు. భాకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.

హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ విధించినట్లు పీవోకే డిప్యూటీ కమిషనర్ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDMA),ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(PDMA)రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు.