భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

పాక్‌లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్‌కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా, మాన్సేరా, గుజ్రాత్, చిత్రాల్, మలాకంద్, ముల్తాన్, షంగ్లా, బజౌర్, స్వాట్, సహీవాల్, రహీమ్ యార్ ఖాన్, మీర్పూర్ నగరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

సాయంత్రం 4గంటల సమయంలో వచ్చిన భూకంపానికి 22.3కిలోమీటర్ల ప్రాంతం ప్రభావం చూపించింది. పంజాబ్‌లోని వ్యవసాయ భూమి, కశ్మీర్ కూడా భారీ నష్టానికి గురయ్యాయని జియోలాజికల్ సర్వేలో తేలింది. 10కిలో మీటర్ల లోతు నుంచి సంభవించడంతో పంజాబ్ లోని చాలా ప్రాంతం నష్టపోయింది. ఖైబర్ పంక్తుక్వా‌లు స్వల్పంగా నష్టపోగా, మీర్పూర్, కశ్మీర్‌లు ఘోరమన నష్టాన్ని చవిచూశాయని అధికారులు తెలిపారు. 

ప్రత్యక్ష సాక్ష్యులు 50మందికి పైగా గాయాలకు గురైనట్లు తెలిపారు. కొన్ని చోట్ల కూలిన భవంతుల కింద పడి ప్రాణాలు సైతం కోల్పోయినట్లు సమాచారం. మీర్పూర్ లోని రోడ్లు రెండుగా చీలడంతో ఓ బిల్డింగ్ కూలి భారీ నష్టం వాటిల్లింది. భూకంపం పాకిస్తాన్‍‌లోని పలు ప్రాంతాలపైనే కాకుండా భారత్‌లోని రాజస్థాన్, పంజబ్, హర్యానాల్లోనూ ప్రభావం చూపించింది. 

రిక్టర్ స్కేలుపై భారత్‌లో 6.3పాయింట్లు నమోదుకాగా, పాకిస్తాన్‌లో 5.8మాత్రమే నమోదు అయింది. నష్టంతో పోలిస్తే భారత్ కంటే పాక్‌లోనే ఎక్కువ జరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.