డిగ్రీ పట్టా అందుకొనే లోపు..10 మొక్కలు నాటాలి

డిగ్రీ పట్టా అందుకొనే లోపు..10 మొక్కలు నాటాలి

students to plant 10 trees : డిగ్రీ పట్టా అందుకొంటున్నారా..అంత లోపు..మీరు పది మొక్కలు నాటాల్సి ఉంటుంది. పర్యావరణహితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మొక్కలు నాటడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టే..ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఫిలిప్పీన్స్ చట్టసభలో గత సంవత్సరం మే 15వ తేదీన చట్టరూపం దాల్చింది. పట్టభద్రుడు అయ్యేలోపు..కనీసం 10 మొక్కలు నాటాలని ఈ చట్టంలో రూపొందించారు.

ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని..హై స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో…10 మొక్కలు తప్పనిసరిగా..నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల..ప్రతి ఏటా…175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకరకంగా..525 బిలయన్ మొక్కలు ఈ భూమిపై పెరుగుతాయని అనుకుంటున్నారు. ఈ మొక్కలను అటవీ ప్రాంతాల్లో, పాడుబడిన గనుల్లో నాటాల్సి ఉంటుందని ఫిలిప్పీన్స్ విద్యాశాఖ పేర్కొంది.