N95 masks: N95 మాస్కే అన్ని మాస్క్‌ల కంటే ప్రభావవంతమైంది

పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్లే.. అన్నీ కరోనా వేరియంట్లపై పోరాటానికి ఒకే రకమైన మాస్క్ కూడా పనికిరాదు.

N95 masks: N95 మాస్కే అన్ని మాస్క్‌ల కంటే ప్రభావవంతమైంది

Mask

N95 masks: పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్లే.. అన్నీ కరోనా వేరియంట్లపై పోరాటానికి ఒకే రకమైన మాస్క్ కూడా పనికిరాదు. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. కరోనాకు సంబంధించి మూడు మాస్క్‌ల్లో గుడ్డ మాస్క్ ఒకటి, సర్జికల్ మాస్క్ రెండవది, N95 అండ్ KN95 మూడో రకం. అయితే, మనం ఎలాంటి మాస్క్‌లు ధరిస్తున్నామన్నది లెక్కకాదు కానీ, దాన్ని సరిగా ధరిస్తున్నామా? లేదా అన్నదే ప్రధానం.

అయితే, లేటెస్ట్‌గా వచ్చిన వాటర్‌లూ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, “ప్రామాణిక శస్త్రచికిత్స మరియు త్రీ-ప్లే క్లాత్ మాస్క్‌లు వరుసగా 12.4% మరియు 9.8% మాత్రమే స్పష్టమైన సామర్థ్యంతో ఫిల్టర్ చెబుతున్నారు. కానీ, KN95 మరియు N95 మాస్క్‌లు సాధారణంగా ఉపయోగించే గుడ్డ మాస్క్(10%) మరియు సర్జికల్ మాస్క్‌లు (12%) కంటే “గణనీయంగా సమార్థ్యం కలిగి ఉంటుందని వివరించారు. (R95 మరియు KN95 మాస్క్‌లకు వరుసగా 60% మరియు 46% ప్రొటెక్షన్) అందిస్తాయి. గాలిలో వ్యాపించే కరోనా వేరియంట్లను తగ్గించడంలో ఈ మాస్క్‌లు ఉపయోగపడుతాయని వెల్లడించింది అధ్యయనం.

ఖరీదైన, అధిక నాణ్యత గల N95 మరియు KN95 మాస్క్‌లు 50 శాతానికి పైగా ఫిల్టర్ చేయబడినట్లు అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఇది పెద్ద, ఇండోర్ మరియు వెంటిలేటెడ్ గదిలో నిర్వహించబడింది. ఈ మాస్క్‌లు బాగా పనిచేస్తున్నట్లుగా ఇప్పటికే ఎంతోమంది నిపుణులు కూడా ప్రకటించారు.

మన దేశంలో అన్నివర్గాల ప్రజలకు వ్యాక్సిన్‌లు అందలేదు. వ్యాక్సిన్లు అందరికీ అందడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు, దేశంలోని ఆఖరి వ్యక్తికి వ్యాక్సిన్ అందేవరకు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే అని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో జనసాంద్రత చాలా ఎక్కువ కావడంతో వ్యాక్సిన్‌లు వేయడంలో ఆలస్యం కూడా జరుగుతుంది అనేది నిపుణుల అభిప్రాయం. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగేవరకు కూడా మాస్క్ తప్పనిసరిగా వేసుకోవల్సిందే అనేది నిపుణుల అభిప్రాయం.