ఈ బ్లడ్ గ్రూపు వారికి COVID-19 రిస్క్ ఎక్కువ

  • Published By: Subhan ,Published On : June 22, 2020 / 09:18 AM IST
ఈ బ్లడ్ గ్రూపు వారికి COVID-19 రిస్క్ ఎక్కువ

COVID-19 పేషెంట్లలో బ్లడ్ గ్రూపు టైపును బట్టి రిస్క్ స్థాయి మారుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. యూరప్‌లోని  సైంటిస్టులు వేల మంది పేషెంట్లను పరిశీలించి ‘A’ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి ‘O’ బ్లడ్ గ్రూపు వారికంటే రిస్క్ లెవల్ ఎక్కువని చెబుతున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్  ఆఫ్ మెడిసిన్ లో ఇచ్చిన రిపోర్టు దీనిని నిర్థారించింది. దీనిపై క్లారిటీ వచ్చేందుకు మరింత రీసెర్చ్ జరగాలని నిపుణులు అంటున్నారు. 

COVID-19పై జన్యుపరమైన విశ్లేషణలు జరిపిన తర్వాత ‘A’ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి ‘O’ బ్లడ్ గ్రూపు వారికి పలు రకాల జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ‘చాలా మంది దీనిని పట్టించుకోకపోవచ్చు’ అని చైనాకు సంబంధించిన బ్లడ్ స్పెషలిస్ట్ డా.పరమేశ్వరన్ హరి అన్నారు. న్యూయార్క్ చెప్పిన తర్వాత ఈ రిపోర్టు ఎంత ముఖ్యమో తెలుసుకోగలిగాం.

స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్‌స్లేషనల్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన డా. ఎరిక్ టోపోల్.. బ్లడ్ టైప్ అనేది జబ్బులు వ్యాపించడంలో చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, జర్మనీతో పాటు ఇతర దేశాల్లో ఉన్న 2వేల మంది పేషెంట్లు COVID-19తో ఉన్నప్పటికీ కొద్దిపాటి లక్షణాలే కనిపిస్తున్నాయి. 

రీసెర్చర్స్ ఆరు రకాల జీన్స్ ఉన్న వారిపై టెస్టులు నిర్వహించారు. వైరస్ వారిపై ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. కొందరిలో కరోనా వైరస్ విపరీతంగా ప్రభావం చూపిస్తుండటంతో పాటు ఇతరులలో చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. వయస్సును బట్టి, మగ, ఆడ తేడాలను బట్టి రిస్క్ లెవల్స్ మారుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. 

ఎర్ర రక్త కణాల్లో ప్రొటీన్ల ఆధారంగా నాలుగు బ్రడ్ గ్రూపులు ఉంటాయి. A, B, AB Oలు అని డా. మరీ హోరోవిజ్ అంటున్నారు. 

Read: కరోనావైరస్: సెకండ్ వేవ్ అంటే ఏంటి.. నిజంగా రాబోతుందా?