సూడాన్ అల్లర్లలో 37మంది మృతి : ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2019 / 02:46 AM IST
సూడాన్ అల్లర్లలో 37మంది మృతి : ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం వరకు కొనసాగాయి. అయితే ఈ గొడవలకు కారణం ఇంకా తెలియరాలేదు.
ఈ అల్లర్లపై తీవ్రంగా స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం…రెడ్ సీ స్టేట్  గవర్నర్,రీజినల్ సెక్యూరిటీ చీఫ్ ను డిస్మిస్ చేసింది. ఎమర్జున్సీని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా ఆ తెగల ప్రజలు తుపాకీలను ఉపయోగించారని,అల్లర్లకు ఆజ్యం పోసేందుకు అంతర్గత మరియు బయటివాళ్ల జోక్యం ఉందని సూచిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అల్లర్లకు గల పూర్తి కారణాల కోసం దర్యాప్తునకు ఆదేశించింది.

రెడ్ సీ స్టేట్ రాజధాని అయిన పోర్ట్ సుడాన్ ఒక ముఖ్యమైన షిప్పింగ్ మార్గం. ఆ దేశ వాణిజ్యం చాలావరకు ఈ ఓడరేవు గుండా వెళుతుంది, దీనిని దక్షిణ సూడాన్ చమురు ఎగుమతి చేయడానికి కూడా ఉపయోగిస్తుంది. సూడాన్ దీర్ఘకాల నాయకుడు ఒమర్ అల్-బషీర్ ను బహిష్కరించిన తర్వాత… పౌరులు  మిలిటరీల మధ్య అధికారాన్ని పంచుకునే ఒప్పందం కుదిరింది. దీంతో నెలల రోజుల గందరగోళం నుండి సూడాన్ బయటపడింది