Suez Canal blockage : సూయజ్ కాలువలో భారీగా నిలిచిపోతున్న నౌకలు.. ఫోర్ పాయింట్ ప్లాన్‌పై భారత్ కసరత్తు

ప్రపంచ దేశాలకు క్రూడ్​ ఆయిల్​ రవాణాకు అత్యంత ఆధారమైన సూయజ్​ కాలువ  నౌక రవాణాకు మార్చి 23 నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశానికి నౌక ద్వారా సాగే రవాణా మార్గాలపై ప్రభావం పడుతోంది.

Suez Canal blockage : సూయజ్ కాలువలో భారీగా నిలిచిపోతున్న నౌకలు.. ఫోర్ పాయింట్ ప్లాన్‌పై భారత్ కసరత్తు

Suez Canal Blockage

Suez Canal blockage : ప్రపంచ దేశాలకు క్రూడ్​ ఆయిల్​ రవాణాకు అత్యంత ఆధారమైన సూయజ్​ కాలువ  నౌక రవాణాకు మార్చి 23 నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశానికి నౌక ద్వారా సాగే రవాణా మార్గాలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణం వైపు కాలువ మార్గాల్లో 200 వరకు నౌకలు నిలిచిపోయాయి. వచ్చే కొన్ని రోజుల్లో ఈ మార్గంలో వచ్చే నౌకల రాకపోకలు భారీగా నిలిచిపోనున్నాయి. నౌకల సంఖ్య 300 వరకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోర్ పాయింట్ ప్లాన్ పై కసరత్తు చేస్తోంది. సూయజ్ కాలువ మార్గంలో వచ్చే నౌకలను మరో మార్గానికి దారి మళ్లీంచే ప్రయత్నం చేస్తోంది.

కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా నౌకలను మళ్లించనుంది. ఈజిప్టు సమీపంలో మద్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే ఈ సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మార్చి 23 నుంచి ఈ జలమార్గం మూతపడింది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య నౌక రవాణా వేగవంతంగా జరిగే మార్గమిది. ఎవర్​ గివెన్​ కంపెనీకి చెందిన 2.2 లక్షల టన్నుల భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలుల కారణంగా సూయజ్ కాలువ మార్గంలో చిక్కుకుపోయింది.

అటుగా వెళ్లే నౌకల రాకపోకలు నిలిచిపోయాయి.  ఇరువైపులా భారీ సంఖ్యలో నౌకలు  నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని కారణంగా వందల కోట్లలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ దేశాల మధ్య 200 బిలియన్ డాలర్ల విలువైన భారీ నౌక రవాణా ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి.