నమ్మలేని నిజం.. గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. 3వారాల్లో రెండుసార్లు..

ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ వింత, కనీ వినీ ఎరుగని విడ్డూరం, మెడికల్ మార్వెల్ అనే చెప్పాలి. ఒక మహిళ రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చి వైద్య రంగానికే సవాలుగా మారింది. గర్భంతో ఉండగానే కడుపులో ఉన్న బిడ్డ పుట్టకండానే ఆమె మళ్లీ గర్భం దాల్చడం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

నమ్మలేని నిజం.. గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. 3వారాల్లో రెండుసార్లు..

Surprise Conception

Surprise conception : ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ వింత, కనీ వినీ ఎరుగని విడ్డూరం, మెడికల్ మార్వెల్ అనే చెప్పాలి. ఒక మహిళ రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చి వైద్య రంగానికే సవాలుగా మారింది. గర్భంతో ఉండగానే కడుపులో ఉన్న బిడ్డ పుట్టకండానే ఆమె మళ్లీ గర్భం దాల్చడం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

Baby Noah

గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం:
ఈ అరుదైన అద్భుత ఘటన ఇంగ్లండ్​లో చోటు చేసుకుంది. అప్పటికే గర్భంతో ఉన్న మహిళ మళ్లీ గర్భవతి అయ్యింది. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘సూపర్ ఫెటేషన్-(Superfetation)’ లేదా ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ అంటారు. ఇంగ్లండ్‌లోని బాత్ లో నివసిస్తున్న రెబక్కా రాబర్ట్స్ అనే 39 ఏళ్ల మహిళకు ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రెబెక్కా కొద్ది నెలల క్రితం గర్భం దాల్చింది. కడుపుతో ఉండగానే భర్తతో శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె రోజుల వ్యవధిలోనే మరోసారి గర్భం దాల్చింది. 2020 సెప్టెంబర్​ 17న ఆమె ఆశ్చర్యకరంగా కవల పిల్లలకు(ఆడ, మగ) జన్మనిచ్చింది. డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేశారు.

Rebecca

బలహీనంగా మగ బిడ్డ:
ఆడ బిడ్డకు రొసలీ అని పేరు పెట్టగా.. మగ బిడ్డకు నోవా అని పేరు పెట్టారు. ఆడ బిడ్డతో పోల్చుకుంటే మగ బిడ్డ పరిమాణంలో చాలా చిన్నగా బలహీనంగా జన్మించాడు. దీనికి కారణం ఆ బిడ్డ నెలలు నిండకుండా పుట్టడమే అని డాక్టర్లు వెల్లడించారు. ఆ బాలుడిని 95 రోజుల పాటు హాస్పిటల్​లో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు.

Noah

కవలలే.. కానీ, పోలికలు లేవు:
బాబుని సుమారు మూడు నెలలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎట్టకేలకు డిసెంబర్ 25న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. సాధారణంగా కవల పిల్లలుగా పుట్టినవారికి ఒకే రకమైన పోలికలుంటాయి. కానీ రెబెక్కాకు జన్మించిన కవల పిల్లలకు వేర్వేరు పోలికలతో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది వైద్య రంగంలో అద్భుతంగా డాక్టర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఇటువంటి కేసులు నమోదు చేయబడ్డాయని వారు స్పష్టం చేస్తున్నారు.

Noah is still ahead of Rosalie

వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్ అంటారు:
గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చడం అరుదైన సంఘటన అని.. ఇది సూపర్​ఫెటేషన్​ కారణంగానే జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, నివేదికల ప్రకారం ఇటువంటి అరుదైన ఘటనలు ప్రపంచంలో 0.3% మంది మహిళల్లో మాత్రమే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కానీ, ఇలా జరిగిన చాలా సందర్భాలలో, రెండో శిశువు గర్భధారణ సమయంలోనే మరణిస్తుంది. కానీ, రెబెక్కా​కు జన్మించిన రెండో శిశువు కూడా ఆరోగ్యంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని డాక్టర్లు చెబుతున్నారు.

0.3% మహిళల్లోనే సూపర్​ఫెటేషన్..
“నేను గర్భం దాల్చగానే బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు డాక్టర్లు స్కాన్​ చేశారు. అప్పుడు గర్భంలో ఒక్క బిడ్డ మాత్రమే ఉంది. మూడు వారాల తర్వాత మరోసారి బిడ్డ పెరుగుదల కోసం మరోసారి స్కాన్​ చేస్తే.. గర్భంలో మరో బిడ్డ కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం వినగానే నేను ఆశ్చర్యానికి లోనయ్యా. డాక్టర్లు కూడా విస్తుపోయారు” అని రెబెక్కా అంది. వైద్య పరిభాషలో ఇటువంటి గర్భాన్ని సూపర్ ఫెటేషన్​ లేదా డబుల్​ ప్రెగ్నెన్సీ అంటారని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు, ఆమె ప్రెగ్నెన్సీ కోసం వాడిన మందుల వల్లే ఇలా డబుల్​ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. రెబెక్కా తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంలో మరో అండం విడుదలై ఉంటుందని.. అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని చెప్పారు.

సూపర్​ఫెటేషన్​ అంటే?
సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చగానే అండాశయం అండాలను విడుదల చేయడం నిలిపివేస్తుంది. కానీ, సూపర్​ఫెటేషన్​ అనే అత్యంత అరుదైన సందర్భంలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతుంది. మహిళ గర్భంతో ఉన్నప్పటికీ అండం విడుదలవుతుంది. ఆ సమయంలో మహిళ శృంగారంలో పాల్గొంటే, పురుషుడి వీర్యం అండాన్ని చేరి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్​ఫెటేషన్​ అత్యంత అరుదుగా జరుగుతుంటుంది.

కాగా.. ఇలాంటి అరుదైన మెడికల్ అద్భుతం 2016లోనూ జరిగింది. ఆస్ట్రేలియా మహిళలో కూడా ఇటువంటి సూపర్‌ఫెటేషన్ కేసు నమోదైంది. ఆమె కేవలం 10 రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. 10 రోజుల వ్యవధిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 2008 స్టడీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 10వరకు ఉన్నాయి.