Susan Khan Birthday Party : జన్మదిన వేడుకల్లో సింహం.. మండిపడుతున్న నెటిజన్లు

జన్మదిన వేడుకలంటే స్నేహితులు కుటుంబ సభ్యులే వస్తుంటారు. కానీ ఓ ప్రముఖ మహిళ మాత్రం తన జన్మదిన వేడుకలకు ఏకంగా మృగరాజునే తీసుకొచ్చింది. దానిని కుర్చీలో కూచోబెట్టి చైన్లతో కట్టేసింది. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Susan Khan Birthday Party : జన్మదిన వేడుకల్లో సింహం.. మండిపడుతున్న నెటిజన్లు

Susan Khan Birthday Party

Susan Khan Birthday Party : జన్మదిన వేడుకలంటే స్నేహితులు కుటుంబ సభ్యులు వస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తన జన్మదిన వేడుకలకు ఏకంగా మృగరాజునే తీసుకొచ్చింది. దానిని కుర్చీలో కూచోబెట్టి చైన్లతో కట్టేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ చెందిన ప్రభావశీలురాలు సుసాన్ ఖాన్ తన జన్మదిన వేడుకలకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి చిక్కుల్లో పడ్డారు.

తాజాగా సుసాన్ ఖాన్ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది. ఈ వేడుకకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఈమె జన్మదిన వేడుకలకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సింహాన్ని వేడుకలకు తీసుకొచ్చారు. దానిని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. దానితో కొందరు పరిహాసం ఆడారు. సుసాన్ ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ దగ్గర డబ్బు ఉంటే వేరే విధంగా ఎంజాయ్ చెయ్యండి.. మీరు మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొండకండి.. మిమ్మల్ని (సుసాన్ ఖాన్) ఓ పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఇలానే ఓ చైర్ కి కట్టిపడేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని వీడియోకు కామెంట్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వేడుకలో సింహానికి మత్తుమందు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీడియోపై నెగటివ్ కామెంట్స్ రావడంతో పోస్ట్ చేసిన 24 గంటల్లో దానిని డిలీట్ చేసింది సుసాన్ ఖాన్.. ఇక నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Project Save Animals (@projectsaveanimals)

 

 

 

 

 

మీరు చేసిన పని అసహ్యకరమైనది, నీచమైనది… ఇది ఏ విధంగా ఆమోదయోగ్యమైనది కాదు. ఈ చర్యను చూస్తుంటే మీకసలు (సుమన్ ఖాన్) మనసాక్షి లేనట్లు కనిపిస్తుందని అంటున్నారు. పార్టీలో ఉన్నవారు తప్పతాగి ఆ సింహాన్ని భయపెడుతున్నారని నెటిజన్లు వాపోయారు. ఆ మహిళతోపాటు ఆ పార్టీలో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై వన్యప్రాణుల సంరక్షణ సంఘం ప్రతినిధులు ఓ ఆన్‌లైన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో వన్యప్రాణులను ఉపయోగించకూడదని ఆన్‌లైన్ వేదికగా సంతకాలు సేకరిస్తున్నారు.