అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ : గెలుపెవరిది?

  • Published By: bheemraj ,Published On : November 5, 2020 / 12:12 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ : గెలుపెవరిది?

US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ కొనసాగుతోంది. కౌంటింగ్ లో ఎప్పటికప్పుడు లెక్కలు మారుతుండటంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రిపబ్లిక్ లు, డెమోక్రాట్లు మెజారిటీకి దూరంగా ఉన్నారు. కీలక రాష్ట్రాల్లో ఎప్పిటికప్పుుడు ఆధిక్యం మారుతోంది. కౌంటింగ్‌ ప్రారంభమై 15 గంటలవుతున్నా ఇంకా గెలుపెవరిదన్నదానిపై క్లారిటీ లేదు. విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది.



అమెరికా చరిత్రలో ఇలాంటి ఫలితం వెలువడటం ఇదే మొదటిసారి. అటు ట్రంప్, ఇటు బైడెన్ ఇద్దరూ గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ.. ఎవరూ మ్యాజిక్‌ మార్క్‌కు దగ్గరగా లేరు. స్వింగ్‌ స్టేట్స్‌లో ఇంకా ఫలితం తేలకపోవడంతో విజయం ఊగిసలాడుతోంది. అధ్యక్షుడెవరో తెలుసుకోవాలంటే అమెరికన్లతోపాటు ప్రపంచమంతా మరికొన్ని గంటలపాటు ఆగాల్సిందే.



ప్రస్తుతం బైడెన్‌ 238, ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ ఓట్లతో ఉన్నారు. మ్యాజిక్ మార్క్ 270. పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడాలో కౌంటింగ్ కొనసాగుతుంది. 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేయాలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇక 16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో, 15 ఎలక్టోరల్ ఓట్లున్న నార్త్ కరోలినాలో ఆయన తక్కువ మార్జిన్ తో లీడ్ లో ఉన్నారు.



మిచిగాన్, నెవాడలో బైడెన్ లీడ్ లో ఉన్నారు. మిచిగాన్ లో ట్రంప్ మొదట పట్టు చూపించినప్పటికీ ఆ తర్వాత బైడెన్ వైపు మొగ్గింది. నెవాడ, విస్కాన్సిస్ తోపాటు మిచిగాన్ ను కనుక గెలిస్తే బైడెన్ మ్యాజిక్ మార్క్ ను టచ్ చేయవచ్చు. ధర్జాగా వైట్ హౌస్ లోకి అడుగు పెట్టొచ్చు.



అయితే పెన్సిల్వేనియాను కోల్పోవడం బైడెన్ కు గట్టి ఎదురు దెబ. కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో అత్యధిక ఓటర్లున్న మూడో పెద్ద రాష్ట్రమిది. పైగా ఇది బైడెన్ స్వంత రాష్ట్రం. గతంలో ఇక్కడ డెమోక్రాట్లకు పట్టు ఉండేది. అయితే 2016 లో రిపబ్లికన్లు దీన్ని కైవసం చేసుకున్నారు. మూడు వారాల క్రితం వరకు సర్వేలో ఇక్కడ ఆధీక్యంలో కనిపించిన బైడెన్ ఆ తర్వాత వెనుకబడ్డారు.



ఇంకా పోస్టల్ ఓట్లు కౌంట్ చేయాల్సివుండటంలో ఆధిక్యం ఎటైనా మారే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెమోక్రాట్లు పోస్టల్ ఓట్ల వినియోగించుకున్నారు. దీంతో గెలుపు తమదేనని బైడెన్ వర్గం ధీమాగా ఉంది. పాపులర్ ఓట్ల విషయానికొస్తే ట్రంప్ కంటే బైడెన్ 26 లక్షలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా విజయం దక్కాలని ఏమీ లేదు.



ఫలితం బైడెన్ కు అనుకూలంగా వచ్చినా పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు కొన్ని వారాలు పట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ట్రంప్ కోర్టుకు వెళ్తామని ప్రకటించడంతో బహుశా కొన్ని వారాలు పట్టొచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లే అధ్యక్షున్ని నిర్ణయించే అవకాశం ఉండటంతో ఓట్ల లెక్కింపులో మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్ అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లలో మోసాలు జరగడం అమెరికాలో చాలా తక్కువ. అయినా ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ ఓట్లను అంగీకరించడాన్ని ఆయన మొదటి నుంచి తప్పుబడుతున్నారు.



అయితే రాష్ట్రాలు మాత్రం అది తమ ఇష్టమంటున్నాయి. దీన్నే ట్రంప్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? గంట గంటకు మారిపోతున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారాయన. వైట్ హౌస్ లో పీఠం దక్కించుకోవాలంటే అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లలో ఇప్పటివరకు ట్రంప్ 213 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడిన సందర్భంలో ఫలితాలపై కోర్టుకు వెళ్తామంటూ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విజయం సాధించబోతున్నామని చెబుతుూనే ఈ రకమైన కామెంట్లు చేశారాయన.



మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ తన మద్దదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనం గెలబోతున్నాం..నమ్మకం ఉంచడంటూ తన సపోర్టలకు చెప్పారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు