Sweden: స్వీడన్‌కు రోజుల వ్యవధిలోనే రెండోసారి మహిళా ప్రధానిగా..

స్వీడన్ ప్రధానిగా రాజీనామా చేసిన కొద్ది రోజుల విరామంలోనే మరోసారి ప్రధానిగా ఎంపికయ్యారు మాగ్దలీనా ఆండర్సన్. రాజకీయ గందరగోళం, ఎన్నికలకు ముందు జరిగిన ఉత్కంఠల మధ్య ఆండర్సన్ రాజీనామా...

Sweden: స్వీడన్‌కు రోజుల వ్యవధిలోనే రెండోసారి మహిళా ప్రధానిగా..

Sweden Prime Minister

Sweden: స్వీడన్ ప్రధానిగా రాజీనామా చేసిన కొద్ది రోజుల విరామంలోనే మరోసారి ప్రధానిగా ఎంపికయ్యారు మాగ్దలీనా ఆండర్సన్. రాజకీయ గందరగోళం, ఎన్నికలకు ముందు జరిగిన ఉత్కంఠల మధ్య ఆండర్సన్ రాజీనామా చేశారు. విశేషంగా అలా జరిగిన కొద్ది రోజులకే తిరిగి సోమవారం ప్రధానిగా నియమితులయ్యారు.

సోషల్ డెమోక్రాట్‌లతో కూడిన మైనారిటీ ప్రభుత్వం వారం కంటే తక్కువ వ్యవధిలోనే రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆమె మాదిరిగానే మాజీ ఆర్థిక మంత్రి బుధవారం ఇదే విధమైన గెలిచారు.

349 సీట్ల పార్లమెంటులో 100 సీట్లను దక్కించుకున్న ఆండర్సన్ మాట్లాడుతూ.. ‘అన్ని మైనారిటీ ప్రభుత్వాల మాదిరిగానే, పార్లమెంటులో ఇతర పార్టీలతో సహకారాన్ని కోరుతున్నాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం’ అని వ్యాఖ్యానించారు.

………………………………………. : 70వేల మంది సైనికుల‌కు క‌రోనా, 190 మంది మృతి

‘సోషల్ డెమొక్రాట్‌లు పార్లమెంట్‌లో అత్యధిక తేడాతో అతిపెద్ద పార్టీ గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. ఇతరులతో సహకరించే సుదీర్ఘ సంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తామని, స్వీడన్‌ను నడిపించడానికి అవసరమైన ప్రతిదానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.