Swimmer Blows Up: స్విమ్మింగ్ చేస్తూ ఫ్యామిలీ చూస్తుండగానే పేలిపోయాడు!

ఫ్యామిలీ అంతా చూస్తుండగానే స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా పేలిపోయాడు. యుక్రెయిన్ బీచ్ లో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా పరుగులు తీశారు. బీచ్ వైపుకు పరిగెత్తుకుని వెళ్లిన వాళ్లంతా ఒక్కసారిగా వెనక్కు పరిగెత్తడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది.

Swimmer Blows Up: స్విమ్మింగ్ చేస్తూ ఫ్యామిలీ చూస్తుండగానే పేలిపోయాడు!

Swimmer Blown Up

Swimmer Blows Up: ఫ్యామిలీ అంతా చూస్తుండగానే స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా పేలిపోయాడు. యుక్రెయిన్ బీచ్ లో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా పరుగులు తీశారు. బీచ్ వైపుకు పరిగెత్తుకుని వెళ్లిన వాళ్లంతా ఒక్కసారిగా వెనక్కు పరిగెత్తడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ప్రమాదం తర్వాత అతని మృతదేహంలో ముక్కలు ఎగిరి ఫ్యామిలీ ఉన్న చోటే పడటం మరింత విషాదకరంగా మారిపోయింది.

రష్యాతో యుద్ధం జరుగుతుండటంతో నీటి అడుగున మైన్స్ ఏర్పాటు చేశారని.. అక్కడ ఈదడాన్ని నిషేదిస్తున్నట్లు స్థానిక అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

రష్యా ఉద్దేశపూర్వకంగానే సముద్రంలో మైన్లు వేశారని యుక్రెయిన్ ఆరోపించింది. అయితే క్రెమ్లిన్ దళాలు కైవ్ కారణమని ఆరోపించాయి.

యుక్రెయిన్, రష్యా నల్ల సముద్ర తీరాన్ని జార్జియా, NATO సభ్యులు, రొమేనియా, బల్గేరియా, టర్కీ ప్రాంతాలకు అనుసంధానం చేయబడి ఉంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యుక్రేనియన్ తీర ప్రాంతాల్లో నుండి నాలుగు మైన్లు కనిపించాయి. మూడు టర్కిష్ జలాల్లో కాగా, ఒకటి రొమేనియా తీరంలో కనిపించింది.

Read Also: ఎల్‌వోసీ వద్ద కార్చిచ్చు.. పేలుతున్న ల్యాండ్‌మైన్లు

“ఒడెస్సా ప్రాంతంలో నివాసితులు, విజిటర్లు నియమాలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు కోరారు. సముద్రం తీరప్రాంత రక్షణ జోన్‌కు వెళ్లొద్దు. ఈత కొట్టవద్దు” అని పోలీసులు కోరారు.

“డోనెట్స్క్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విషాదకరమైన పరిణామాలకు దారితీసింది. ఒడెస్సా జిల్లాలోని గ్రామంలో సముద్రంలో ఈత కొడుతుండగా, ఓ వస్తువు పేలి 50 ఏళ్ల వ్యక్తి మృతికి కారణమైంది. అతని భార్య, కొడుకు, స్నేహితుడి కళ్ల ముందే ” ఈతకు వెళ్లిన క్షణాల్లోనే ఇలా జరగడం బాధాకరం” అని పోలీసులు పేర్కొన్నారు.

“మరోసారి, తీరాన్ని సందర్శించడం మరియు సముద్రంలో ఈత కొట్టడంపై కఠినమైన నిషేధం, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైన భద్రతా చర్యలు,” అని ప్రకటన జోడించబడింది.