Shocking News: మూల పారేసిన పాత గిన్నె..జంటను కోటీశ్వరుల్ని చేసింది

పనికి రాదని మూలన పారేసిన ఓ పాత గిన్నె ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. వేలంలో ఏకంగా ఆ గిన్నె రూ.34 కోట్లు పైనే పలికింది..

Shocking News: మూల పారేసిన పాత గిన్నె..జంటను కోటీశ్వరుల్ని చేసింది

Switzerland Couple Luck Changed By Old Bowl

switzerland couple luck changed by old bowl : లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులైనట్లుగా విన్నాం. లేదా ఏ వజ్రమో దొరికి మిలియనీర్లు అయినవారి గురించి కూడా విన్నాం.కానీ ఓ పాత గిన్నె..ఓ చిన్న గిన్నె భార్యాభర్తల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసిన విషయం మీకు తెలుసా? పనికి రాదని పారేసిన రాయి మూలకు తలరాయి అవుతుంది అన్నట్లుగా పనికిరాదని ఓ మూల పారేసిన ఓ గిన్నె ఓ జంట పాలిట అదృష్ట దేవతగా మారింది.ఆ పాత గిన్నె.. ఏకంగా కోట్ల రూపాయల స్విట్జర్లాండ్‌ జంటకు కాసుల వర్షం కురిపించింది. ఓ పాత గిన్నెపై ఉన్న డిజైన్ చూసి ముచ్చటపడి కొనుక్కున్న గిన్నె వారి పాలిట అక్షయపాత్రగా మారి డబ్బులు కురిపించింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ జంట ఒక రోజు దొంగల మార్కెట్ అనే పేరున్న మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ వారు సామాన్లు కొందామని వారికి అవసరమైనవాటి కోసం చూస్తున్నారు. అలా చూస్తున్నవారి కళ్లు ‘ ఓపాత గిన్నె’ పై పడ్డాయి. దానిపై ఉన్న డిజైన వారిని ఆకట్టుకుంది. అబ్బా ఎవరు దీన్ని ఎవరు తయారు చేశారో గానీ ఎంత బాగా డిజైన్ వేశారు?అని మురిసిపోయారు.ఆ గిన్నె వారికి ఎంతగానో నచ్చటంతో ఆ గిన్నెను కొనుక్కోవాలని ముచ్చటపడ్డారు.ఆ దుకాణదారుడు తో‘ ఆ గిన్నె ఎంత? అని అడిగారు. దానికి అతను నిర్లక్ష్యంగా ఆ గిన్నె వంక చూస్తూ..ఇది చాలా పాత గిన్నె పెద్ద రేటు కూడా ఉండదు అని చెబుతూ చాలా తక్కువ ధరకే వారికి అమ్మాడు. ఆ గిన్నె వారి జీవితాన్ని మార్చేస్తుందని ఆ సమయంలో ఆ జంట కూడా ఊహించలేదు. అదే మరి అదృష్టం సైలెంట్ గా వస్తుంది..దురదృష్టం దడదడలాడుతు వస్తుంది అంటారు.అలా ఆ గిన్నె కొనుకున్న జంట ఇంటికి వచ్చేశారు.

ఇంటికి వచ్చాక కూడా ఆ గిన్నె మీదున్న డిజైన్ ను చాలా ఆసక్తిగా చూస్తూ తెగ మురిసిపోయారు. ఇది చాలా పాతకాలం నాటిదిలా ఉంది అని అనుకున్నారు. అలా దాన్ని పరిశీలించిన వారు.. అది పురాతన గిన్నె అని భావించారు. అలా దాన్ని చూస్తున్న వారికి ఓ ఐడియా వచ్చింది. పురాతన వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది కదా..దీన్ని వేలం వేద్దామా? అని అనుకున్నారు.అలా ఆ గిన్నెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేలానికి పెట్టారు. కానీ వారి అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. వేలానికి వచ్చిన వారు ఆ గిన్నెను కూడా హా..ఇది మరీ పాత సత్తుగిన్నెలా ఉంది. అంటూ పెదవి విరిచి వెళ్లిపోయేవారు. దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. అందరూ దాన్ని పనికిరాని గిన్నెగానే భావించారు. దాంతో వారి ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. మనం ఈ గిన్నె గురించి అతిగా ఆలోచించామేమో..ఇది నిజంగా పనికి రానిదేనేమో అనుకున్నారు.

అలా అనుకున్న ఆ జంట ఆ గిన్నెను ఇంటికి తీసుకెళ్లి ఓ మూలకు పడేశారు. ఆ తరువాత ఆ గిన్నె ఇంట్లో ఉందనే విషయమే మర్చిపోయారు. ఇంతలో ఒకరోజు వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పురాతన వస్తువులు వేలం వేసే నిపుణుడు వారికి ఫోన్ చేసి..మీ దగ్గర ఓ పాతకాలం గిన్నె ఉందని మాకు సమాచారం వచ్చింది నిజమేనా అని అడిగాడు. దానికి వారు అదో పాత గిన్నె దాన్ని ఎవ్వరూ కొనటంలేదు అని తాపీగా సమాధానం చెప్పారు. కానీ సదరు వ్యక్తి మాత్రం ఆ గిన్నెను నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. సరే రండి అని చెప్పగా వారి ఇంటికి వచ్చిన సదరు వ్యక్తి ఆ గిన్నె చూసి తాను అనుమానించింది నిజమేననుకున్నాడు.

ఆ తరువాత ఆ జంటకు ఆ గిన్నె ప్రత్యేకత గురించి చెప్పాడు. ఈ గిన్నె 17వ శతాబ్దానికి చెందినదని, దీనిని చైనా రాజు ఉపయోగించారని చెప్పాడు. దాంతో ఆ జంట ఆశలు మళ్లీ చిగురించాయి. అలా ఆ గిన్నెను ప్రముఖ నిపుణులు పరిశీలించి దానిని వేలానికి పెట్టగా..ఏకంగా భారత కరెన్సీ ప్రకారం రూ.34.5 కోట్లు పలికింది. దీంతో ఆ జంట రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. అతి తక్కువ డబ్బులు పెట్టి కొని దాన్ని పనికి రాదని మూల పారేసిన ఆ గిన్నెకు అంత డబ్బు రావటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిందా జంట. వాస్తవానికి ఇది 2019లో జరిగింది. అయితే, ప్రస్తుతం మళ్లీ ఈ గిన్నె ట్రెండింగ్‌గా మారటంతో మరోసారి ఈ గిన్నె సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.