Same Sex Marri : స్వలింగ సంపర్కుల వివాహాలకు గ్రీన్ సిగ్నల్..కేరింతలు కొడుతున్న జనాలు

స్వలింగ సంపర్క వివాహానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

Same Sex Marri : స్వలింగ సంపర్కుల వివాహాలకు గ్రీన్ సిగ్నల్..కేరింతలు కొడుతున్న జనాలు

Same Sex Marriages Legal Switzerland

Same Sex marriages legal: స్వలింగ సంపర్కుల వివాహాలు కొన్ని దేశాల్లో అనుమతించరు. మన భారత్ లో కూడా ఇటువంటి మ్యారేజ్ లు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారని..మా కుటుంబంలో మా వివాహాన్ని అంగీకరించటంలేదని మాకు భద్రత కావాలని పోలీసులను..ధర్మాసనాలను ఆశ్రయించిన జంటలున్నాయి. కానీ స్వలింగ్ వివాహాలకు భారత్ లో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇది చట్టబద్దం అని గానీ చట్ట వ్యతిరేకత అని గానీ లేదు.

కానీ పలు పాశ్చత్య దేశాల్లో స్వలింగ సంపర్క (గే మ్యారేజ్‌ను) వివాహాలను చట్టబద్దం చేయాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఈక్రమంలో స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసేలా స్విట్జర్లాండ్ ప్రజలు ఓటు వేశారు. స్వలింగ వివాహానికి మద్దతుగా.. మూడింట రెండు వంతుల ప్రజలు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ వ్యక్తపరిచారు. పౌర వివాహం, స్వలింగ స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునే హక్కుకు చట్టబద్దత కల్పిస్తూ.. స్విట్జర్లాండ్ ఆదివారం (సెప్టెంబర్ 26,2021)నిర్వహించిన రెఫరెండంలో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీతో అంగీకరించింది. దీంతో పశ్చిమ ఐరోపాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశాలలో స్విట్జర్లాండ్ ఒకటిగా నిలిచింది.

Read more : సుప్రీంకోర్టు ఆమోదించినా..స్వలింగ సంపర్కుల వివాహాలు అంగీకరించం : కేంద్రం

స్విస్ ఫెడరల్ ఛాన్సలర్ ఫలితాల ప్రకారం.. స్విట్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించిన దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో 64.1% మంది ఓటర్లు స్వలింగ వివాహానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై సంతోషం వ్యక్తంచేస్తు స్వలింగ సంపర్కులు సంబరాలు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఆనందంగా ర్యాలీలు నిర్వహించారు. డ్యాన్సులు చేస్తు..కేరింతలు కొడుతూ నగరంలో ర్యాలీలు నిర్వహించారు.

కాగా..స్విట్జర్లాండ్ లో సవరించిన చట్టం ప్రకారం.. స్వలింగ జంటలు వివాహం చేసుకోవడానికి, వారికి ఇష్టమైన పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వివాహితలు, లెస్బియన్ జంటలు కూడా స్పెర్మ్ డొనేషన్ ద్వారా పిల్లలను కనడానికి కూడా అనుమతినిచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈ నిబంధలను అమలులోకి రావాలంటే 2022 జూలై 1 వరకు ఆగాల్సిందే. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని స్విస్ న్యాయశాఖ మంత్రి కరిన్ కెల్లర్-సుట్టర్ వెల్లడించారు.

Read more : పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. పెద్దలు మందలించేసరికి

స్విస్ ఫెడరల్ ఛాన్సలర్ ప్రకటన తరువాత గేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తు..ఇది మాకు ఎంతో సంతోషం కలిగించిందనీ..స్వలింగ వివాహ చట్టబద్దత కోసం పోరాటం చేసిన ఆంటోనియా హౌస్‌విర్త్ తెలిపారు. స్వలింగ జంటలకు పౌర వివాహానికి చట్టబద్దత కల్పించడం సమానత్వానికి ఇచ్చిన గౌరవం అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.

కానీ దీనిపై స్విస్ పీపుల్స్ పార్టీ నాయకులు, ప్రజాభిప్రాయ కమిటీ సభ్యురాలు మోనికా రూగెగర్ ‘నో టూ మ్యారేజ్ ఫర్ ఆల్’అంటూ’ తన నిరాశ వ్యక్తంచేశారు. ఇది ప్రేమకు గానీ…మనో భావాలకు సంబంధించింది విషయం కాదు..పిల్లల సంక్షేమం గురించి అని.. పిల్లలు, తండ్రులు ఓడిపోయారు అంటూ ఆమె తీవ్ర నిరాశను వ్యక్తంచేశారు.

Read more :పెళ్లి చేసుకున్న ‘ఇద్దరమ్మాయిలు’..