ప్రపంచంలోనే అతి చిన్నబంగారు నాణెంపై ఐన్‌స్టీన్ ఫోటో

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 05:18 AM IST
ప్రపంచంలోనే అతి చిన్నబంగారు నాణెంపై ఐన్‌స్టీన్ ఫోటో

ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బంగారపు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ స్విస్‌మింట్  తయారు చేసింది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 23)న ప్రకటించింది. జర్మనీకి చెందిన  ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చిత్రాన్ని ఈ బంగారు నాణెంపై ముద్రించారు. ఐన్ స్టీన్ నాలుక బయటపెట్టి ఉన్న చిత్రాన్ని ముద్రించారు.

2.96 మిల్లీ మీటర్ల వ్యాసం(0.12 అంగుళాలు) కలిగిన ఈ నాణెం బరువు 0.063 గ్రాములని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని తయారీకి 0.26 డాలర్ల( రూ.18) ఖర్చు అయిందని తెలిపారు. ప్రత్యేక భూతద్దంతో నాణెంపై ఉన్న ఐన్‌స్టీన్ చిత్రాన్ని చూడవచ్చు.  ఇటువంటి నాణేల్ని 999 తయారు చేశామనీ..ఒక్కో నాణేన్ని 199 డాలర్ల (రూ.14,189)కు విక్రయించనున్నట్టు ప్రతినిధులు వెల్లడించారు.