snake in lettuce : సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన పాలకూరలో పాము

snake in lettuce : సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన  పాలకూరలో పాము

Sydney Man Finds Snake In Lettuce Bought From Supermarket

lettuce in snake : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే భార్యాభర్తలిద్దరూ సరుకులు, కూరగాయాలు తెచ్చుకోవటానికి సూపర్ మార్కెట్ కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొన్నారు. ఇంటికొచ్చాశారు. తెచ్చి కూరల్ని సర్ధుదామని తీసారు..ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. వాళ్లు మార్కెట్ నుంచి తెచ్చని పాలకూర కట్టలు పెట్టిన కవర్ లోంచి బుస్ బుస్ మంటూ ఓ పాము బైటకొచ్చింది. దాన్ని చూసి ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ పాలకూర ప్యాకెట్ లో 7.8 అంగుళాల పాము బైటకొచ్చింది. దాన్ని చూసిన వారి గుండెలు ఒక్కసారిగా ఫాస్టుగా కొట్టుకున్నాయి. అది పాము..పైగా విషపూరితమైన పాము..! దాన్ని చూసిన వారికి ఇలాక్కూడా జరుగుతుందా? అనుకుంటూ ఆశ్చర్యపోయారు. మిగిలిన కూరగాయలు…ఆకు కూరల్లో ఇటువంటివేమన్నా ఉన్నాయనే భయంతో జాగ్రత్తగా వాటిని పరిశీలించి మరీ భద్రపరుచుకున్నారు.

అలెక్స్ వైట్ అనే వ్యక్తి తన భార్య అమేలియా నీట్ తో కలిసి కొనుగోలు చేసిన పాలకూర ప్యాకెట్‌లో అరుదైన విషసర్పం ఒకటి కనిపించటంతో అతను వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. తాను మార్కెట్ లో పాలకూర కట్ట తీస్తున్నప్పుడు ఏదో బరువుగా అనిపించిందనీ..లోపల ఏదైనా ఉందా? ఏంటీ అని సరదాగా తనలో తానే అనుకున్నాననీ కానీ అదే నిజమైందని తెలిపాపడు అలెక్స్. ఇది నిజంగా చాలా చాలా షాకింగ్ గా అనిపించిందనీ..పొరపాటున ప్యాకెట్ మొత్తం విప్పేస్తే ఏమయ్యేదో..ఆ విషసర్పం కాటుకు బలయ్యేవాళ్లమేమోనని తెలిపాడు.

పాలకూరలో పాము ఉన్న విషయాన్ని అలెక్స్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వెంటనే వచ్చి ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా సూపర్ మార్కెట్ లోని పాలకూరలోకి పాము ఎలా వచ్చింది? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండీ ‘పాలకూరలో పాము’ని..