కూతురు రూమ్ లోకెళ్లిన తల్లికి షాక్ : వెన్నులో వణుకుపుట్టిస్తున్న దృశ్యం..!!

కూతురు రూమ్ లోకెళ్లిన తల్లికి షాక్ : వెన్నులో వణుకుపుట్టిస్తున్న దృశ్యం..!!

Sydney mother goosebumps  seeing this in daughter room  :  అది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ఓ ఇల్లు. ఆ ఇంటిలో తల్లి తన కూతురు పడుకున్న గదిలోకి ఏదో పనిమీద వెళ్లింది. అలా వెళ్లిన ఆమె షాక్ అయిపోయింది. గుండె ఆగిపోయినంత పనైంది. రూమ్ లోకి వెళ్లి యదాలాపంగా గోడవైపు చూసిన ఆ తల్లికి ఆ గది మూలల్లో పుట్టలు పుట్టలుగా వందల సంఖ్యలో సాలె పురుగులు ఉన్నాయి.



వాటి సైజు అరచేయి అంతంత ఉన్నాయి. పైగా అవి సాధారణ పాలె పురుగులు కాదు. ‘హంట్స్‌మన్’ సాలెపురుగులు. ఇవి భారీ ఆకారంలో ఉండే విషపూరితమైనవి. ఇవి కరిస్తే..వికారం, తలనొప్పి, వాంతులు అవుతాయి. పల్స్ రేట్ కూడా పడిపోతుంది. దీంతో కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా కలుగుతుంది.

గదిలో ఆ సాలెపురుగుల్ని చూసిన ఆమెకు గుండె దడ పెరిగిపోయింది. అవికూడా గుట్టలు గుట్టలుగా ఉండటంతో ఆ దృశ్యం భయానకంగా ఉంది. ఈ భయంకర దృశ్యాన్ని.. ఆ ఇంటి యజమాని స్నేహితురాలైన పెటీ ఆర్ అనే ఓ ట్విట్టర్ యూజర్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.



వీటిని చూసిన చాలామంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఇంట్లో వాళ్లు ఎలా ఉంటున్నార్రా బాబూ అంటున్నారు. చూస్తుంటేనే గుండె ఆగినంత భయమేస్తోందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఫొటోలు చూస్తే ఫొటోషాప్‌లో ఎడిట్ చేసినట్లు ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.దీంతో పెటీ ఆర్ ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఈ సాలె పురుగుల వీడియో తెగ వైరల్ అయింది.