Taiwan: చైనా వర్సెస్ అమెరికా.. తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనా హెచ్చరికలు బేఖాతర్..

అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి తైవాన్ చేరుకున్నారు. పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా రగిలిపోతుంది. ఈ పరిణామం చైనా, అమెరికా మధ్య తీవ్ర అగాధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Taiwan: చైనా వర్సెస్ అమెరికా.. తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనా హెచ్చరికలు బేఖాతర్..

Taiwan: అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి తైవాన్ చేరుకున్నారు. మలేసియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీకి చేరుకున్నారు. తైపీలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆమె అక్కడే బస చేశారు. పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో అమెరికా – చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తైవాన్ లో పెలోసీ పర్యటన ప్రారంభంకాగానే చైనా అధికారిక వార్తా సంస్థ స్పందించింది. తైవాన్ పరిసర సముద్ర జలాల్లో చైనా సైన్యం ఆదివారం వరకు లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు హెచ్చరికగా సైనిక విన్యాసాలకు చైనా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. చైనా సైన్యం తైవాన్ వైపు 21 విమానాలను పంపించింది.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు

ఇదిలాఉంటే తైవాన్ తమ దేశంలోని అంతర్భాగమని, తమ మాట వినకుండా అక్కడ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చైనా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే చైనా హెచ్చరికలను నాన్సీ పెలోసీ ఏ మాత్రం లెక్కచేయకుండా తైవాన్ రాజధానిలో అడుగు పెట్టింది. మరోవైపు పెలోసీ తైవాన్ పర్యటనను అమెరికా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో తైవాన్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు తేల్చిచెప్పినట్లు స్పష్టమైంది. ఈ పరిణామం అమెరికా- చైనా మధ్య మరింత అగాదానికి కారణం కాబోతున్నట్లు తెలుస్తోంది.

America VS China : తైవాన్ విషయంలో తలదూర్చొదంటూ..అన్‌ట్రేసబుల్ మిస్సైల్‌ తో అమెరికాకు చైనా వార్నింగ్..

ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో తాజా పరిణామాలు అమెరికా వర్సెస్ చైనా మధ్య మరింత ఉద్రిక్తతలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే పెలోసీ పర్యటనపై స్పందించేందుకు తైవాన్ విదేశాంగ శాఖ నిరాకరించింది. ఆమె పర్యటనపై తైవాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. అమెరికాకు తైవాన్ సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతున్న విషయం విధితమే. 25ఏళ్ల తరువాత తైవాన్ ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం గమనార్హం. తైవాన్ లో అడుగు పెట్టిన తరువాత ఆమె కీలక ప్రకటన చేశారు. తైవాన్ లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సాయాన్ని కొనసాగించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్

ఇదిలాఉంటే తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ బుధవారం ఉదయం పెలోసితో సమావేశమవుతారని, ఆపై కలిసి లంచ్ చేస్తారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. పెలోసి, మరో ఆరుగురు అమెరికన్ చట్టసభ సభ్యులతో కలిసి తైవాన్ లో ప్రయాణిస్తుంది. తైవాన్ లో పెలోసీ బృందం పర్యటనను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతుందని అన్నారు. పెలోసీ తైవాన్ పర్యటన అమెరికా – చైనా సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.