Taliban : మంత్రివర్గ విస్తరణ, మహిళలకు దక్కని చోటు.. తాలిబన్ల అరాచకం

మహిళలకు మంత్రిపదవులు అవసరం లేదని, వాళ్లు పిల్లల్ని కంటే చాలని ఇప్పటికే తాలిబన్లు అన్న సంగతి తెలిసిందే. అందుకే కేబినెట్‌లో మహిళా మంత్రిత్వశాఖను కూడా ఎత్తేశారు. ఆ శాఖకు కేటాయించిన..

Taliban : మంత్రివర్గ విస్తరణ, మహిళలకు దక్కని చోటు.. తాలిబన్ల అరాచకం

Taliban

Taliban : ఇటీవలే తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు చేసిన తాలిబన్లు మరో అడుగు ముందుకేశారు. కేబినెట్ విస్తరణ చేపట్టారు. డిప్యూటీ మంత్రుల పేర్లను ప్రకటించారు. అయితే, ఇందులోనూ ఒక్క మహిళ కూడా లేదు. కాగా, ఇది కేవలం తాత్కాలిక కేబినెట్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పడం విశేషం.

Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్‌లు

మహిళలకు మంత్రిపదవులు అవసరం లేదని, వాళ్లు పిల్లల్ని కంటే చాలని ఇప్పటికే తాలిబన్లు అన్న సంగతి తెలిసిందే. అందుకే కేబినెట్‌లో మహిళా మంత్రిత్వశాఖను కూడా ఎత్తేశారు. ఆ శాఖకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అందులో కొత్తగా ప్రకటించిన ధర్మ ప్రచార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలైన తర్వాత మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు తెచ్చారు. వారిని విద్యకు, ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు. ఇప్పటికే ఆరు నుంచి 12వ తరగతి చదివే బాలురు స్కూళ్లకు వెళ్తుండగా.. బాలికలకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాగా, దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ముజాహిద్‌ చెప్పారు. దానికంటే ముందు ‘భద్రమైన వాతావరణం’ ఏర్పాటు చేయాలి కదా అని చెప్పుకొచ్చారు.

IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన గురించి అంతర్జాతీయ సమాజం పలు హెచ్చరికలు చేసింది. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయినప్పటికి తాలిబన్లలో మార్పు లేదు. మరోసారి ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదు. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కొత్త పేర్ల జాబితాను సమర్పించారు. క్యాబినెట్ విస్తరణను సమర్థించారు. ఇందులో హజారాలు వంటి జాతి మైనారిటీల సభ్యులు ఉన్నారని చెప్పారు. మహిళలను తర్వాత చేర్చవచ్చని కూడా ఆయన సెలవిచ్చారు.

సెప్టెంబర్ 7 న అఫ్ఘానిస్తాన్‌ను పరిపాలించడానికి మధ్యంతర ఏర్పాటును తాలిబన్లు ప్రకటించారు. 20ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చారు. భయంకరమైన హక్కానీ నెట్‌వర్క్ నాయకులు కీలక స్థానాల్లో ఉన్నారు. హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడి కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ అఫ్ఘాన్ కొత్త అంతర్గత మంత్రిగా ఎంపికయ్యారు. FBI మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో అతడు ఒకడు.