Taliban : 15 ఏళ్లు దాటిన అమ్మాయిలపై తాలిబన్ల కన్ను!

అమెరికా,నాటో ద‌ళాలు ఉప‌సంహ‌ర‌ణ మొద‌లైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Taliban : 15 ఏళ్లు దాటిన అమ్మాయిలపై తాలిబన్ల కన్ను!

Afgan2

Taliban అమెరికా,నాటో ద‌ళాలు ఉప‌సంహ‌ర‌ణ మొద‌లైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌, పాకిస్థాన్, ఉజ్బెకిస్తాన్‌, త‌జ‌కిస్తాన్ దేశ స‌రిహ‌ద్దుల‌తో ఉన్న బోర్డ‌ర్ పోస్టు జిల్లాల‌ను తాలిబ‌న్లు మ‌ళ్లీ స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన సరిహద్దుల ప్రాంతాలతో సహా 85శాతం ఆఫ్గనిస్తాన్ పూర్తిగా తమ చేతుల్లో ఉందని ఇటీవల తాలిబన్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు కాందహార్ ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, తాలిబన్లు స్థానిక మ‌త‌పెద్ద‌ల‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిల జాబితాతో పాటు 45 ఏళ్ల లోపు ఉన్న వితంతువుల వివ‌రాలు ఇవ్వాల‌ని తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని అందరు ఇమామ్ లకు మరియు ముల్లాహ్ లకు ఈ మేరకు ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. తాలిబ‌న్ కల్చరల్ కమిషన్ పేరుతో జారీ చేసిన లేఖలో.. త‌మ ఫైట‌ర్లు ఆ ఆడ‌వాళ్ల‌ను పెళ్లి చేసుకోనున్న‌ట్లు తాలిబ‌న్లు పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న త‌ర్వాత వారిని పాకిస్తాన్‌లోని వజ‌రిస్తాన్‌కు తీసుకువెళ్లి.. అక్క‌డ ఇస్లాం మ‌తంలోకి మార్చ‌నున్న‌ట్లు తాలిబ‌న్ ఆ లేఖలో పేర్కొంది.

మరోవైపు,ఆఫ్ఘానిస్తాన్ లోని టకర్ ఫ్రావిన్స్ లోని మహిళలు తమ ఇళ్ల నుంచి ఒంటరిగా బయటకి రాకూడదని,పురుషులు గడ్డం పెంచాలని తాలిబన్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తమ వెర్షన్ ఇస్లామిక్ చట్టాన్ని ఆఫ్ఘాన్ ప్రజలపై బలవంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న తాలిబన్ ఉగ్ర‌వాదులు త‌మ ఇండ్ల‌ల్లో ఉన్న ఆడ‌వాళ్ల‌ను తీసుకువ‌చ్చి, వారిని పెళ్లి చేసుకుని, బానిస‌లుగా మార్చుతార‌ని ఆ దేశంలోని వృద్ధ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాలిబ‌న్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జ‌లు డిప్రెష‌న్‌లోకి వెళ్తున్నార‌ని చెబుతున్నారు.