Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు

అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్‌జాదా.

Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు

Afgha

Taliban Bans Polygamy: ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసి..అఫ్గానిస్తాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు..తమ దేశంలో ప్రజా పాలనపై ద్రుష్టిసారిస్తున్నారు. దేశంలో ఇస్లామిక్ షరియా చట్టాలను అమలు చేస్తూ ప్రజలు ఆ చట్టాలు పాటించేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాలిబన్ నేతలు. ఇస్లాం మతానికి విరుద్ధమైన అసాంఘీక కార్యకలాపాలను నిషేదించిన తాలిబన్ నేతలు..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. “ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది” అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్‌జాదా. ఇకపై ఒక వ్యక్తి ఒకరినే పెళ్లాడాలని..కారణాలు సాకుగా చూపి 2,3,4 భార్యలను పొందకూడదని హెచ్చరించారు.

Other Stories:Monkeypox cases : 11 దేశాల్లో 80 మంకీపాక్స్‌ కేసులు.. అయినా ఆందోళనక్కర్లేదు.. నిపుణుల సూచన!

ముఖ్యంగా తాలిబన్ గ్రూప్ సభ్యులు ఈ ఆదేశాలు తూచా తప్పకుండ పాటించాలని..ఉల్లంఘనలకు పాల్పడే వారిపై షరియా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హిబతుల్లా అఖుంద్‌జాదా తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగోలేనందున ప్రజల జీవనం దుర్భరం కాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్ నేతలు ప్రకటించారు. “తాలిబాన్ సభ్యులు రెండవ, మూడవ మరియు నాల్గవ వివాహాలను నివారించాలి” అని అఖుంద్జాదా నొక్కిచెప్పారు, ఎందుకంటే ఇది ఖరీదైన వ్యవహారం.

Other Stories:Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!

“ఉల్లంఘించిన వారిని గుర్తించి నాయకత్వానికి నివేదించాలని ఆదేశ అమ్ర్-ఉల్-మరూఫ్ మంత్రిత్వ శాఖ (న్యాయ మంత్రిత్వ శాఖ)కి సూచించాడు. ఇస్లామిక్ షరియా చట్టాలను పాటిస్తున్న అఫ్గానిస్తాన్ లో పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. అఫ్గానిస్తాన్ లో బహుభార్యత్వం విస్తృతంగా ఆచరించబడుతుంది. మొదటి భార్య నుండి సంతానం లేకపోవడం, పుట్టింట్లో యువతుల పోషణ భారం వంటి కారణాల వలన ఆఫ్ఘన్ పురుషులు నలుగురు భార్యలను తీసుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటారు.