Taliban : 85శాతం ఆఫ్గనిస్తాన్ భూభాగం తాలిబన్ చేతుల్లోకి

దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు,నాటో దళాలు వైదొలగడంతో తాలిబన్‌లు మళ్లీ జోరు పెంచారు.

Taliban : 85శాతం ఆఫ్గనిస్తాన్ భూభాగం తాలిబన్ చేతుల్లోకి

Taliban

Taliban దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు,నాటో దళాలు వైదొలగడంతో తాలిబన్‌లు మళ్లీ జోరు పెంచారు. అఫ్గానిస్తాన్ అంతటా అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్- ఇరాన్ మధ్య ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటైన ఇస్లామ్ కాలా బోర్డర్ సహా 85 శాతం ఆఫ్గనిస్తాన్ భూభాగం తమ కంట్రోల్ లో ఉందని తాలిబన్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. దేశంలోని మొత్తం 398 జిలాల్లో..250జిల్లాల వరకు తమ ఆధీనంలో ఉన్నాయని ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో ఉన్న తాలిబన్ల ప్రతినిధుల బృందం తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దళాల ఉపసంహరణను సమర్థించుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తాలిబన్ సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకోవడంతో..ఇరాన్ సరిహద్దు నుండి చైనాతో సరిహద్దు వరకు ఒక భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం పూర్తి చేసినట్లు తాలిబన్ సంస్థ తెలిపింది.

అఫ్గానిస్తాన్- ఇరాన్ మధ్య ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఇస్లామ్ కాలా బోర్డర్ ఒకటి. అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి దీని ద్వారా నెలకు 2 కోట్ల డాలర్ల విలువైన ఆదాయం వస్తుంది. సరిహద్దు భద్రతా దళాలు సహా అన్ని అఫ్గాన్ బలగాలు హేరత్ ప్రావిన్స్‌లో ఉన్న ఇస్లామ్ కాలా క్రాసింగ్‌ను తిరిగి ప్రభుత్వపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ అరియాన్ తెలిపారు.

మరోవైపు,తాలిబన్లతో తలపడలేక వందల సంఖ్యలో ఆఫ్గనిస్తాన్ సైనికులు పొరుగునున్న తజకిస్తాన్ కి పారిపోతున్నారు. తజకిస్తాన్ ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను తరలించింది. రష్యా కూడా తజకిస్తాన్ లోని తన సైనిక స్థావరాన్ని బలోపేతం చేస్తోంది.