Taliban Commander: తాలిబాన్ ఆర్మీ కమాండర్.. భార్యను మిలటరీ హెలికాప్టర్‌లో ఇంటికి

కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు ఏకంగా మిలటరీ హెలికాప్టర్ నే వాడేసుకున్నాడు తాలిబాన్ ఆర్మీ కమాండర్. ఈస్టరన్ అఫ్ఘనిస్థాన్ లో ఉన్న లోగార్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వరకూ చాపర్ సాయంతో ప్రయాణించినట్లు తెలుస్తుంది.

Taliban Commander: తాలిబాన్ ఆర్మీ కమాండర్.. భార్యను మిలటరీ హెలికాప్టర్‌లో ఇంటికి

Helicopter

 

 

Taliban Commander: కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు ఏకంగా మిలటరీ హెలికాప్టర్ నే వాడేసుకున్నాడు తాలిబాన్ ఆర్మీ కమాండర్. ఈస్టరన్ అఫ్ఘనిస్థాన్ లో ఉన్న లోగార్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వరకూ చాపర్ సాయంతో ప్రయాణించినట్లు తెలుస్తుంది. అతను హఖ్కానీ బ్రాంచ్ కు చెందిన తాలిబాన్ ఆర్మీ కమాండర్ అని స్థానిక మీడియా పేర్కొంది.

ఈ వీడియో కమాండర్ అత్తారింటిలో దిగి.. కూతురు తండ్రికి 12లక్షల అఫ్ఘనీలను చెల్లించి తన భార్యను తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. బర్కీ బరాక్ జిల్లాలోని లోగర్‌లో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సైతం వెల్లడించింది.

ఇదిలా ఉంటే తాలిబాన్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ దీనిపై వాదనకు దిగుతూ అవన్నీ అసత్యాలంటూ కొట్టిపారేశాడు. తాలిబానీ కమాండర్ మిలటరీ హెలికాప్టర్ వాడుకోలేదని తోసి పుచ్చాడు. సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రాపర్టీని తప్పుగా వినియోగిస్తున్నారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Read Also: ఇస్లాంను అవమానిస్తున్నాడని తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ మోడల్ అరెస్ట్

మహిళల హక్కులను అణచివేస్తున్నారంటూ తాలిబాన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళలు, బాలికల హక్కులపై తాలిబాన్ ఉల్లంఘనల జాబితా పెరుగుతోంది. దేశంలో హక్కుల ఉల్లంఘన గురించి పెరుగుతున్న ఆందోళనలను లేవనెత్తినప్పుడు హ్యూమన్ రైట్స్ వాచ్ మహిళా హక్కుల విభాగం హీథర్ బార్ ఇలా పేర్కొన్నారు.

మహిళల హక్కులను గౌరవిస్తామని తాలిబాన్ వాగ్దానాలు అబద్ధమని ఆఫ్ఘన్ మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారని అన్నారు. ఆగష్టు 15, 2021న తాలిబాన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ బృందం మహిళలపై అణిచివేతను తీవ్రతరం చేస్తుందని ఆఫ్ఘన్ హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు.