Afghan girls: బుర్ఖా వేసుకోలేదని అమ్మాయిలను విద్యాలయంలోకి రానివ్వని తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అమ్మాయిలను అణచివేస్తే చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా బుర్ఖా ధరించకుండా విద్యాలయంలోకి వస్తున్న బాలికలను ఓ తాలిబన్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని వెనక్కి పంపించాడు. ఈశాన్య అఫ్గానిస్థాన్ లోని బదక్షన్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్లు సూచించిన ధుస్తులు ధరించని విద్యార్థినులను నిన్న విద్యాలయ గేటు బయటే నిలబెట్టారు. సరైన దుస్తులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. చివరకు వారిని తిప్పి పంపించారు.

Afghan girls: బుర్ఖా వేసుకోలేదని అమ్మాయిలను విద్యాలయంలోకి రానివ్వని తాలిబన్లు

Afghan girls: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అమ్మాయిలను అణచివేస్తే చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా బుర్ఖా ధరించకుండా విద్యాలయంలోకి వస్తున్న బాలికలను ఓ తాలిబన్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని వెనక్కి పంపించాడు. ఈశాన్య అఫ్గానిస్థాన్ లోని బదక్షన్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్లు సూచించిన ధుస్తులు ధరించని విద్యార్థినులను నిన్న విద్యాలయ గేటు బయటే నిలబెట్టారు. సరైన దుస్తులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. చివరకు వారిని తిప్పి పంపించారు.

అఫ్గాన్ లో మహిళలు స్వేచ్ఛగా తిరిగే హక్కును, భావవ్యక్తీకరణ, ఉద్యోగ అవకాశాలు, చివరికి ఇష్టమైన దుస్తులు ధరించే హక్కులను హరిస్తూ తాలిబన్లు ఆంక్షలు విధించారు. అఫ్గాన్ ను తాలిబన్లు 2021, ఆగస్టు 15 నుంచి తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ఆ వెంటనే మహిళలు, బాలికల హక్కులకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించారు. మహిళలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిరసన తెలుపుతున్న మహిళలను దారుణంగా కొడుతూ చిత్రవధ చేశారు.

ఆయా దృశ్యాలు ప్రసారం చేసిన జర్నలిస్టులను కూడా హింసించారు. అనధికారికంగా నిరసనలు తెలపడాన్ని కూడా నిషేధించారు. ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు తాలిబన్ల తీరుపై పలుసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. తాలిబ‌న్ ప్ర‌భుత్వ చేష్టలతో అమ్మాయిల భ‌విష్య‌త్తు అంధ‌కారంలోకి వెళ్ళే ప్ర‌మాదం ఉంద‌ని న్యూయార్క్ వేదిక‌గా ప‌నిచేసే మాన‌వ హ‌క్కుల సంఘం ‘హెచ్ఆర్‌డ‌బ్ల్యూ’ కూడా పేర్కొంది.

చాలా మంది అఫ్గాన్ బాలిక‌లు మాధ్య‌మిక విద్య‌కు దూర‌మ‌య్యారని తెలిపింది. అఫ్గాన్ లో ల‌క్ష‌లాది మంది బాలిక‌లు త‌మకున్న అవ‌కాశాల‌ను కోల్పోతున్నార‌ని పేర్కొంది. భవిష్యత్తులో బాలిక‌లు చ‌దువుకోవ‌చ్చా? అనే విష‌యంపై కూడా సంభాషించే అవ‌కాశం అఫ్గాన్ లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అక్కడి మ‌హిళలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాలిబ‌న్లు ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో మ‌హిళ‌ల నాయ‌క‌త్వం లేకుండా కూడా చేశారు. అంతటితో ఊరుకోకుండా పురుషుడి తోడు లేకుండా మ‌హిళ‌లు ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని ఆంక్ష‌లు విధించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..