Afghanistan : కాబూల్ లో మహిళల నిరసన..కాల్పులు జరిపిన తాలిబన్

తాలిబన్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మహిళలు ఆందోళనకు దిగారు.

Afghanistan : కాబూల్ లో మహిళల నిరసన..కాల్పులు జరిపిన తాలిబన్

Afgahn

Afghanistan తాలిబన్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మహిళలు ఆందోళనకు దిగారు. బాలికలు మాధ్యమిక పాఠశాలకు వెళ్లకుండా నిరోధిస్తూ ఈ నెల ప్రారంభంలో తాలిబన్ ఆదేశాలు జారీ చేసిన  నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తూ తూర్పు కాబూల్‌లోని ఓ హైస్కూల్ బయట ఆరుగురు సభ్యుల మహిళల బృందం ఆందోళనకు దిగింది. “మా పెన్నులు విరగొట్టవద్దు, మా పుస్తకాలను కాల్చవద్దు, మా పాఠశాలలను మూసివేయవద్దు”అని రాసి ఉన్న ఓ బ్యానర్‌ను అక్కడ ఉంచారు నిరసనకారులు.

ALSO READ  గడ్డం నుంచి గాలిపటాల వరకు.. తాలిబన్ ప్రభుత్వం ఏమేం బ్యాన్ చేసిందో తెలుసా

అయితే,తమ మాటలను లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్న మహిళలను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ తాలిబాన్ ఫైటర్.. ఆటోమేటిక్ వెపన్ తో కొద్దిసేపు గాలిలోకి కాల్పులు జరిపాడు.

ఓ తాలిబాన్ ఫైటర్.. ఆటోమేటిక్ వెపన్ తో కొద్దిసేపు గాలిలోకి కాల్పులు జరిపాడు. అంతేకాకుండా వెంటనే ఆందోళన ముగించి వెళ్లిపోవాలంటూ మహిళలపై తాలిబన్లు భౌతికదాడికి దిగారు. ఈ సమయంలో ఓ విదేశీ జర్నలిస్టు కూడా గాయపడ్డారు. దీంతో “అఫ్ఘాన్ మహిళా కార్యకర్తల ఆకస్మిక ఉద్యమం” అని పిలువబడే ఆందోళనకారుల బృందం స్కూల్ లోపల ఆశ్రయం పొందారు.

కాబూల్ స్పెషల్ ఫోర్సెస్ హెడ్ మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ..మిగతాదేశాల్లో మాదిరిగానే వాళ్లకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. కానీ వాళ్లు ముందే భద్రతా సంస్థలకు సమాచారమివ్వాలి. ఇవాళ కాబూల్ లో ఆందోళన చేసిన మహిళలకు తమ నిరసన గురించి ముందుగా సెక్యూరిటీ అథారిటీస్ కి సమాచారమివ్వలేదు అని తెలిపారు.