Exchange gunfire: పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌ తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు

పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి. పాక్, అఫ్గాన్ మధ్య ఉండే దురండ్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు భారీ ఆయుధాలు వాడి కాల్పులు జరుపుకున్నారు. దురండ్ లైన్ వద్ద పాకిస్థాన్ ఆర్మీ శిబిరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికారి నజిబుల్లా హనీఫ్ మీడియాకు తెలిపారు.

Exchange gunfire: పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌ తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు

Exchange gunfire: పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి. పాక్, అఫ్గాన్ మధ్య ఉండే దురండ్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు భారీ ఆయుధాలు వాడి కాల్పులు జరుపుకున్నారు. దురండ్ లైన్ వద్ద పాకిస్థాన్ ఆర్మీ శిబిరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికారి నజిబుల్లా హనీఫ్ మీడియాకు తెలిపారు.

దంగం ప్రాంతంలో పాక్ సైన్యం మోర్టారు షెల్స్ తో ఆదివారం కాల్పులు జరపిందని చెప్పారు. ప్రస్తుతం పాక్ ఆర్మీ, తాలిబన్లు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. కాగా, పాక్, అఫ్గాన్ సరిహద్దుల వద్ద ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ లోని బలూచిస్థాన్, అఫ్గాన్ లోని నిమ్రోజ్ ప్రావిన్స్ లలో గత నెల పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగింది.

తమ దేశంపై ఇతర ఏ దేశమైనా సరే దూకుడుగా వ్యవహరిస్తే తాము ఉపేక్షించబోమని అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి ప్రకటించారు. పొరుగు దేశాలన్నింటితో తాము సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్ళిపోవడంతో అఫ్గాన్ తాలిబన్ల అధీనంలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంతో తాలిబన్లే తమ దేశ రక్షణ బాధ్యతను చూసుకుంటున్నారు.

Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్