Afghanistan : ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు కసరత్తు, పలు దేశాలకు ఆహ్వానం

పంజ్‌షిర్‌లో జెండా పాతిన తాలిబన్లు...అప్ఘానిస్తాన్ మొత్తం తమ ఆధీనంలోకి రావడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.

Afghanistan : ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు కసరత్తు, పలు దేశాలకు ఆహ్వానం

Taliban

Taliban In Afghanistan : పంజ్‌షిర్‌లో జెండా పాతిన తాలిబన్లు…అప్ఘానిస్తాన్ మొత్తం తమ ఆధీనంలోకి రావడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ దేశాలకు ఆహ్వానం పంపారు. అఫ్ఘాన్‌ స్వాధీనానికి తాలిబన్లకు సాయం చేసిన పాక్‌తో పాటు చైనా, రష్యా, టర్కీ, ఖతార్‌లను ఆహ్వానించారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలి.. మంత్రివర్గంలో ఎవరుండాలి…వంటి అంశాలపై తుది దశ చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్ అగ్రనేతలు.

Read More : Pastor Assaults : చర్చికి వచ్చే యువతులపై పాస్టర్ లైంగికదాడి..మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం

అంతర్గత చర్చలు విఫలం :-
వాస్తవానికి మూడు రోజుల క్రితమే అఫ్ఘానిస్తాన్‌లో బరాదర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కానీ తాలిబన్‌ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు సఫలం కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. తాలిబన్లు, హక్కానీల మధ్య ఆధిపత్య పోరు ఆలస్యానికి ఓ కారణమని తెలుస్తోంది. ఇక మొదటి నుంచి తమకు అండగా నిలిచిన పాకిస్తాన్‌ను ప్రమాణస్వీకారానికి పిలిచారు తాలిబన్లు. అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోవడంతో పాటు పంజ్‌షిర్‌పై తాలిబన్లు చేసిన యుద్ధంలో పాక్‌ సాయం చేసింది. పాకిస్తాన్‌ ఆర్మీ అండతోనే పంజ్‌షిర్‌ను ఓడించింది.

Read More : Afghanistan : పచ్చల లోయ..”పంజ్‌షీర్‌” గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

సహాయం చేసిన పాక్ ఆర్మీ :-
పాక్‌ వైమానిక దళం డ్రోన్లతో పంజ్‌షిర్‌పై బాంబులు కురిపించింది. అటు తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పాక్‌ ISI ఇప్పటికే కాబూల్‌లోని తాలిబన్‌ కీలక నేతలతో చర్చలు జరిపింది. ISI లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌.. అఫ్ఘాన్‌ పాలన పగ్గాలు చేపట్టనున్న బరాదర్‌తో కాబూల్‌లో చర్చలు జరిపారు. అఫ్ఘాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాయం చేయడమే కాకుండా ముల్లా యాకూబ్‌ నేతృత్వంలోని కాందహరీలు, సిరాజుద్దీన్‌ హక్కానీ అధ్వర్యంలోని కాబూలీల మధ్య తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కరించడానికి హమీద్‌ ప్రయత్నించారు.

Read More :Guinea : గినియాలో సైనిక తిరుగుబాటు..ప్రభుత్వం రద్దు..సైన్యం అదుపులో ప్రెసిడెంట్‌

చైనా ప్రధాన పాత్ర :-
అఫ్ఘాన్‌ ఆర్మీలో హక్కానీలను రిక్రూట్ చేసుకోవడానికి పాక్‌ తీవ్రంగా ప్రయత్నించింది.అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్‌ను చైనా ట్రంప్‌ కార్డుగా వాడుకుని.. తాలిబన్లకు రహస్యంగా సాయం చేస్తోందని సమాచారం. అఫ్ఘాన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలైన వెంటనే అన్ని దేశాలు అక్కడ తమ రాయబార కార్యాలయాలను మూసి వేసినప్పటికి చైనా మాత్రం ఆ పని చేయలేదు. అంతేకాక ప్రస్తుతం చైనానే తమను ఆర్థికంగా ఆదుకుంటుందని తాలిబన్లు భావిస్తున్నారు. వీటన్నటికి బలం చేకూర్చేలా తాలిబన్లు పాక్‌, చైనాలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపారు.