Taliban Govt : అమెరికాతో ఎలాంటి సమస్యలు లేవు..అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం : అఫ్ఘాన్ మంత్రి

తమకు అమెరికాతో ఎలాంటి సమస్యలు లేవని..అమెరికాతో సహా దేశాలతో మంచి సంబధాలు కోరుకుంటున్నామని అఫ్ఘాన్ మంత్రి వెల్లడించారు.

Taliban Govt : అమెరికాతో ఎలాంటి సమస్యలు లేవు..అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం : అఫ్ఘాన్ మంత్రి

Taliban Govt

Taliban Minister Comments On USA : అప్ఘాన్ ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశాక తాలిబన్లు తాము పాత తాలిబన్లం కాదు అని పదే పదే చెబుతున్నారు. తాము మారిపోయినట్లుగా నిరూపించుకోవాలని తెగ తాపత్రాయపడుతున్నారు. దీనికి కారణం అంతర్జాతీయంగా ఎదురవతున్న ఒత్తిళ్లు..అఫ్ఘాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఆర్థికంగా..ఆహారపరంగా కూడా అఫ్ఘాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ దేశాల నుంచి సహకారం కూడా అందటంలేదు.సంక్షోభంలో భాగంగా దేశ ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. కన్నబిడ్డల్ని కూడా అంగటి సరుకుల్లా అమ్ముకుంటున్నా దారుణ దుస్థితిలో కూరుకుపోతున్నారు. ఈక్రమంలో అప్ఘాన్ విదేశాంగమంత్రి మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ శాంతి రామాయణం జరిపిస్తున్నారు.మాకు అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. అప్ఘాన్ ను స్వాధీనం చేసుకున్నాక కూడా మహిళలపై తీవ్ర ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు తాము మహిళలను చాలా గౌరవంగా చూస్తున్నామని చెబుతున్నారు.

Read more : Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

అమెరికా దేశంతో తమకు ఎటువంటి సమస్యలు లేవని..అలాగే ఇతర దేశాలతో కూడా తాము మంచి సంబంధాలు కోరుకుంటున్నామని వెల్లడించారు. అఫ్ఘానిస్థాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించడం..దేశాన్ని అస్థిరపరచడం వల్ల ఎవరికైనా ఒరిగేదేమీ లేదని తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం బలహీనంగా మారితే ఎవరికి లాభమని ప్రశ్నించారు. తమకు అన్ని దేశాలతో మంచి సంబంధాలే కావాలని కోరుతున్నారు. అమెరికాతో తమకు సమస్యలేవీ లేవన్నారు. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల డాలర్ల నిధులను నిలిపివేశారని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

‘‘ ఈ సందర్భంగా మేము అమెరికాకు చెప్పేది ఏమింటే..అమెరికా చాలా పెద్ద దేశం. సంపన్నదేశం. అలాంటి దేశానికి ఓపిక, సహనం చాలా అవసరమని సూచించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అఫ్ఘానిస్థాన్ కు సహకరించేలా అన్ని దేశాలు పెద్ద మనసు చేసుకోవాలని కోరారు.. వివాదాలన్నీ తొలగిపోయేలా అఫ్ఘానిస్థాన్ తో అన్ని దేశాలు మంచి సంబంధాలు కొనసాగించాలని మంత్రి ముత్తాఖీ కోరారు.

Read more : Bacrtian treasure : తాలిబన్ల రాజ్యంలో ‘బ్యాక్ట్రియన్ ఖజానా’.. 2000 ఏళ్లనాటి బంగారు నిధి.. సినిమాను తలపించే స్టోరీ

ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా తాము అమ్మాయిల చదువు, ఉద్యోగాలపై తీవ్ర ఆంక్షలు విధించిన మాట వాస్తవమేనని అంగీకరించారు మంత్రి .కానీ..తాము ఇప్పుడు మారిపోయామని పాత నిర్భంధాలు వదిలేశామని..పాలన, రాజకీయ వ్యవహారాల్లో పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా మహిళల సాధికారత గురించి ప్రణాళికలు వేస్తామని..గతం నేర్పిన పాఠాలతో అనుభవం ఆకళింపు చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.కొత్త తాలిబన్ ప్రభుత్వంలో బాలికలు పాఠశాలలకు వెళ్తున్నారని, ప్రైవేటు స్కూళ్లు, యూనివర్సిటీలు నిరాటంకంగా నడుస్తున్నాయని తెలిపారు. 100 శాతం మహిళా ఉద్యోగులు డ్యూటీలకు వెళ్తున్నారని చెప్పారు. మహిళలకు తామిస్తున్న ప్రాధాన్యమేంటో ఇవే చెబుతాయని మంత్రి వెల్లడించారు.

దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని..వారికి భద్రతనూ కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలందరు కాబూల్ లో హాయిగా జీవిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పేదరికం, మంచి జీవితం ఉంటుందన్న ఆరాటంతోనే అమెరికా వెళ్లే ఫ్లైట్ల కోసం గత ఆగస్టులో అఫ్ఘాన్లు కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద గుంపులు గుంపులుగా గుమిగూడి దేశం దాటివెళ్లేయత్నం..తమకు భయపడి కాదని మంత్రి తమ తప్పేమీలేదని తెలియజేసే యత్నం చేశారు.

Read more : Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని ఈసందర్భంగా మంత్రి అంగీకరించారు. కానీ ఇప్పుడు దేశాభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకునేదిశగా యోచిస్తున్నామన్నారు. అమెరికా బలగాలపై దాడులు చేశామన్న నివేదికలో వాస్తవాలు లేవని ముత్తాఖీ చెప్పారు. అనవసర ఆరోపణలు చేయడం తప్పితే.. వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం చూపడంలో అమెరికా విఫలమైందని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులతో పోరాడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా నెమ్మదిగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.