Taliban : ఏ దేశానికీ ముప్పు లేదు..మహిళల హక్కులకు కట్టుబడి ఉన్నామన్న తాలిబన్

అప్ఘానిస్తాన్ నుంచి ఏ దేశానికి కూడా ప్రమాదం పొంచి లేదని తాలిబన్ సంస్థ కీలక ప్రకటన చేసింది.

Taliban : ఏ దేశానికీ ముప్పు లేదు..మహిళల హక్కులకు కట్టుబడి ఉన్నామన్న తాలిబన్

Taliban (3)

అప్ఘానిస్తాన్ నుంచి ఏ దేశానికి కూడా ప్రమాదం పొంచి లేదని తాలిబన్ సంస్థ కీలక ప్రకటన చేసింది. అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో…ఆ దేశం నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశముందని పలు దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం కాబూల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు.

జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. మేము అన్ని వైపులా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. యుద్ధం ముగిసింది. కాబూల్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుంది. యుద్ధ సమయంలో ప్రజలు మరియు కుటుంబాలకు జరిగిన నష్టం ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. అనియంత్రిత పరిస్థితిలో అలా జరిగింది.  ఇప్పుడు మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. మా నాయకుడి ఆదేశాల ఆధారంగా మేము ప్రతి ఒక్కరినీ క్షమించాము. మాజీ సైనిక సభ్యులు మరియు విదేశీ బలగాలతో పనిచేసిన వారితో సహా ఎవరిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోం.. వారి ఇళ్లల్లో ఎవరూ సోదాలు చేయరు. మహిళలకు హక్కులు కల్పించడానికి కట్టుబడి ఉన్నాం.  అప్ఘానిస్తాన్ లో అతి త్వరలోనే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఇక,అప్ఘానిస్తాన్ లోని హిందువులు, సిక్కులు, భారతీయులు కూడా ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని,వారి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తాలిబన్ నేతలు చెబుతున్నారు. మూడు వందలకు పైగా హిందువులు, సిక్కులు కాబూల్‌లోని కార్టే పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుసుకున్న తాలిబన్లు సోమవారం వారిని కలిసి..వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని అకాలీదళ్ ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో రాజకీయ, సైనిక మార్పులు జరుగుతున్నప్పటికీ హిందువులు, సిక్కులు సురక్షితమైన జీవితాన్ని గడపగలరని మేము ఆశిస్తున్నామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ