Taliban : ఇండియా గిఫ్టును స్వాధీనం చేసుకున్న తాలిబన్లు, త్వరలో కాబూల్ స్వాధీనం?

అఫ్ఘాన్‌ సైన్యానికి భారత ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టును తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్‌ ఎయిర్‌పోర్టులో MI-35 హెలికాప్టర్‌ను వశపర్చుకున్నారు. 2019 అక్టోబర్‌లో అఫ్ఘన్‌ సైన్యానికి భారత్‌ ఈ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై పోరుకు ఆఫ్ఘన్‌ సైన్యం దీన్ని వాడుతుండగా..ఇప్పుడా హెలికాప్టర్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నారు

Taliban : ఇండియా గిఫ్టును స్వాధీనం చేసుకున్న తాలిబన్లు, త్వరలో కాబూల్ స్వాధీనం?

Afghan

Modi’s Gift : అఫ్ఘాన్‌ సైన్యానికి భారత ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్టును తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్‌ ఎయిర్‌పోర్టులో MI-35 హెలికాప్టర్‌ను వశపర్చుకున్నారు. 2019 అక్టోబర్‌లో అఫ్ఘన్‌ సైన్యానికి భారత్‌ ఈ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై పోరుకు ఆఫ్ఘన్‌ సైన్యం దీన్ని వాడుతుండగా..ఇప్పుడా హెలికాప్టర్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ హెలికాప్టర్‌కు సంబంధించిన రోటర్‌ బ్లేడ్లు, కీలక విడిభాగాలు కనపించకపోవటం ఆశ్చర్యంగా మారింది. తాలిబన్లు ఈ హెలికాప్టర్‌ను వాడకుండా ఉండేందుకే ముందుజాగ్రత్తగా అఫ్ఘాన్‌ సైన్యం వాటిని తొలగించినట్లుగా తెలుస్తోంది. అటు ఇండియాతో చర్చలపై కూడా తాలిబన్‌లు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More : Ameesha Patel: ఐదు పదుల చేరువలో అమీషా హద్దులు దాటే అందాలు!

పొరుగున ఉన్న పాక్ నుంచి సహకారం తీసుకుంటోన్న తాలిబన్లు.. భారత్‌తో ఇప్పటివరకూ ఎలాంటి చర్చలూ జరపలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. చర్చలు నిష్పాక్షికంగా జరుగుతాయంటేనే తాము భారత్‌తో చర్చలకు కూర్చుంటామని తేల్చి చెప్పారు. తాలిబన్‌ల అధికార ప్రతినిధి మహ్మద్ సొహెయిల్ షాహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్ఘానిస్తాన్ గడ్డపై నుంచి మరో దేశంపై దాడులు చేసేందుకు ఏ వ్యక్తిని, లేదా సంస్థను అనుమతించబోమని కూడా సోహెయిల్ స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పిన సోహెయిల్‌.. ఘానీ ప్రభుత్వానికి తామెన్నటికీ లొంగబోమని స్పష్టం చేశారు.

Read More : Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ ఫ్రూట్స్ మాత్రం తప్పక తీసుకోవాలి

అప్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ త్వరలోనే తాలిబన్‌ల గుప్పిట్లోకి వెళ్లనుంది. కాబూల్‌ను తాలిబన్లు నెల రోజుల్లోగా ఇతర ప్రాంతాల నుంచి వేరు చేయవచ్చునని.. మూడు నెలల్లోగా పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. అఫ్ఘానిస్తాన్‌లో 65 శాతం ప్రాంతాలను ఇప్పటికే తాలిబన్‌లు హస్తగతం చేసుకున్నారని.. మరిన్ని పట్టణాలు, జిల్లాలను వారి వశం కానున్నాయని తెలిపింది.

Read More : Komaki E-Scooter : వృద్ధులు, వికలాంగుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ ఏడు రోజుల్లోనే దాదాపు 11 ప్రొవిన్షియల్ రాజధానులను వారు చేజిక్కించుకున్నారని అమెరికా గుర్తుచేసింది. కాబూల్ ఇక ఎంతకాలం అష్ఘాన్ దళాల రక్షణలో ఉంటుందో చెప్పలేమని అభిప్రాయపడింది. ఇది ఆ సైనికుల పోరు, వారి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. అయితే చివరి క్షణంలో అఫ్ఘాన్ దళాలు తాలిబన్లను గట్టిగా ప్రతిఘటించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడింది.

Read More : Bellamkonda Sai Srinivas : గ‌జ‌దొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్‌ ఫిక్స్

ఇక అఫ్ఘాన్ దళాలతో జరిపిన తీవ్రమైన పోరు తర్వాత ఫైజాబాద్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన వెంటనే అధ్యక్షుడు అష్రాఫ్ ఘని హుటాహుటిన ప్రత్యేక విమానంలో మజారే షరీఫ్ చేరుకొని స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. ఇక్కడ తమ దేశ సైనికుల్లో ధైర్యం నింపేందుకు ఆయన మజారే షరీఫ్ నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అఫ్ఘన్‌ను ఇక ఆ దేశ సైనికులే రక్షించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టంగా ప్రకటించిండంతో అష్రాఫ్ ఘని తమ దేశ రక్షణపై మరింత దృష్టి పెట్టారు.