Taliban: అఫ్గానిస్థాన్​లో మహిళలపై కఠిన ఆంక్షలు.. డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిలిపివేత..

అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా..

Taliban: అఫ్గానిస్థాన్​లో మహిళలపై కఠిన ఆంక్షలు.. డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిలిపివేత..

Taliban's

Taliban: అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా.. వారి విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించిన తాలిబన్లు.. ఆ తరువాత కాలంలో బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని, ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. మహిళల ఉద్యోగాలపైనా తలిబన్ల ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే తాజాగా ఆఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది.

తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఆఫ్గానిస్తాన్ లోని తాలిబాన్ పాలనలో కాబూల్, ఇతర ప్రావిన్సులలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంపై హెరాత్ ట్రాఫికింగ్ నిర్వహణ సంస్థ హెడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి మహిళ డ్రైవర్లకు లైసెన్స్ లు జారీ చేయొద్దని మేము మౌఖికంగా ఆదేశాలు ఇచ్చామని, అయితే మహిళలు డ్రైవింగ్ చేయొద్దని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పాడు. తాలిబన్ల ప్రభుత్వం తాజా ఆదేశాలతో తర్వాత తరానికి మాకు లభించిన అవకాశాలు లేకపోయాయని అదీలా అదీల్ అన్నారు.

Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం

ఆఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరుణంలో అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమయింది. ఈ క్రమంలో 1996 కాలం నాటి పరిపాలన కాకుండా అందరికి ఆమోదయోగ్యమైన పాలన కొనసాగిస్తామని అక్కడి ప్రజలకు తాలిబన్లు తెలిపారు. అయితే పాలన ప్రారంభమై కొద్ది నెలల నుంచే మహిళలపై ఆంక్షలు అమలవుతూ వస్తున్నాయి. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో నిబంధనలను తాలిబన్లు కఠినంగా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ఆఫ్ఘానిస్తాన్ తీవ్రమైన సంక్షోభంతో పోరాడుతోంది. ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక అత్యవసర ఆహార అభద్రతలో ఉంది. ప్రపంచంలో 23 మిలియన్లకుపైగా సహాయం అవసరమని, జనాభాలో దాదాపు 95శాతం మందికి తగినంతగా ఆహార వినియోగం లేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.