TaslimaNasreen:మహిళల్నిసెక్స్ బానిస‌లుగా,పిల్ల‌ల్ని క‌నే యంత్రాలుగా మార్చేస్తారు

తాలిబ‌న్లు మ‌హిళ‌ల‌ను ఇళ్లల్లోనే సెక్స్ బానిస‌లుగా మార్చేస్తారని పిల్లలు కనే యంత్రాలుగానే చూస్తారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన..

TaslimaNasreen:మహిళల్నిసెక్స్ బానిస‌లుగా,పిల్ల‌ల్ని క‌నే యంత్రాలుగా మార్చేస్తారు

Taslima Nasreen Women Will Stay At Home As Sex Slaves (1)

TaslimaNasreen : అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకోవ‌డంపై ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తంచేశారు. తాలిబన్లు చేతిలో ఇక అక్కడి మహిళలు ఇళ్లలో సెక్స్ బానిస‌లుగా మార్చేస్తారని..పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చేస్తారని బంగ్లాదేశ్ ర‌చయిత్రి త‌స్లీమా నస్రీన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాబూల్‌లో ఓ గోడ‌పై ఉన్న మ‌హిళ పెయింట్ ను ఓ వ్య‌క్తి చెరిపేస్తున్న ఫోటోను తస్లీమా తన ట్విట‌ర్ లో షేర్ చేస్తూ..కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాలిబ‌న్లు మ‌హిళ‌ల‌ను ఇక ఎక్క‌డా క‌నిపించ‌కుండా చేస్తార‌ని..మ‌హిళ‌ల్ని ఇళ్లకే పరిమితి చేస్తూ ఇళ్లల్లోనే వారు సెక్స్ బానిస‌లుగా బ్రతికేలా చేస్తారని వారి జీవితాలను ఇళ్లలో మగ్గేలా చేస్తూ..పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండేలా చేస్తారని తాలిబన్ల నైజమే అంత అని అన్నారు.

ఇస్లాం స్త్రీ వ్య‌తిరేకత‌తో కూడిన‌ద‌ని తస్లీమా న‌స్రీన్ వ‌రుస ట్వీట్ల‌లో వ్యాఖ్యానించారు. 1996 నుంచి 2001 వ‌ర‌కూ సాగిన తాలిబ‌న్ల అరాచ‌క పాల‌న‌లో మ‌హిళ‌లు నానా అగచాట్లు పడ్డారని..కనీసం వారు టీవీ చూడటాన్ని..సంగీతం వినటానికి కూడా నోచుకోలేదని అటువంటి అరాచకపు నిషేధాలు విధించారని అన్నారు. ఇన్నేళ్ల తరువాత మరోసారి తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయని తిరిగివ వారి మహిళలపై ఇటువంటి నిబంధ‌న‌ల‌ను తిరిగి విధిస్తారా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ ఒక్క ముస్లిం దేశం కూడా మ‌హిళ‌ల‌ను సాటి మ‌నుషులుగా వ్య‌వ‌హ‌రించ‌ద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా అఫ్గానిస్థాన్ రాజధానిని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అరాచకాలకు నాంది పలికారు. ప్రజల్ని చిత్రహింసల పాలు చేస్తూ వారు మాత్రం విలాసాల్లో మునిగిపోతున్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

ఆఫ్ఘాన్ లో తమ జెండా ఎగురవేసిన తాలిబన్లు గిరింది. ఆగష్టు 15న ఆదివారం నుంచి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంది అఫ్ఘనిస్థాన్. ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసిన తాలిబాన్లు రోడ్లపై కనిపిస్తున్న మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు. పలు అడ్వర్టైజ్మెంట్‌లలో వెడ్డింగ్ డ్రెస్ లలో ఉన్న మహిళల పోస్టర్లు కనిపించకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ లు వైరల్ అవుతున్నాయి. బ్యూటీ సెలూన్లు, బట్టల దుకాణాల బయట ఉన్న పిక్చర్లను పెయింటింగ్ రోలర్ తో కప్పేస్తున్నారు. ఇటువంటి ఓ ఫోటోపై రచయిత్ర తస్లీమా ఈ వ్యాఖ్యలు చేశారు.