Taliban : అప్ఘానిస్తాన్ లో సీన్ రివర్స్..300మంది తాలిబన్లను చంపేసిన ప్రజలు

అఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

Taliban : అప్ఘానిస్తాన్ లో సీన్ రివర్స్..300మంది తాలిబన్లను చంపేసిన ప్రజలు

Afghan (7)

Taliban అఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. దేశంలోని పలు ప్రాంతాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్తర్న్ అలయన్స్ మరియు అప్ఘాన్ సైన్యం మద్దుతుతో పౌరులు తాలిబన్లపై దాడులు చేస్తున్నారు. భగలాన్ ఫ్రావిన్స్ లోని అండరాబ్ జిల్లాలో జరిగిన భీకర పోరులో ఏకంగా 300 మంది తాలిబన్లు హతమైనట్టు సమాచారం. ఈ ప్రాంతంలో ఇంకా తాలిబన్లకి వ్యతిరేకంగా భీకర పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు,అప్ఘానిస్తాన్ లోని మరో రాష్ట్రమైన కపిసాలో కూడా తాలిబన్లపై పౌరులు తిరగబడుతున్నారు.

మరోవైపు, అఫ్ఘానిస్థాన్‌లో ఇప్పటికీ తాలిబన్ల ఆధీనంలోకి రాని ఒకే ఒక రాష్ట్రం పంజ్‌షిర్. పంజ్‌షిర్ కేంద్రంగా పనిచేస్తున్న నార్తన్ అలయన్స్ , అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్..ఇటీవలే తాలిబన్ల పాలన అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పంజ్‌షిర్ లోయను తమ వశం చేసుకునేందుకు వందలకొద్దీ తాలిబన్ ఫైటర్లు భారీ ఆయుధాలతో తరలివెళ్లారు. అయితే.. పంజ్​షేర్​ వైపు వెళ్లిన తాలిబన్లపై అక్కడి బలగాలు తిరుగుబాటు చేశాయని..ఈ క్రమంలో పలువురు తాలిబన్ ఫైటర్లు కూడా మరణించినట్లు సమాచారం.

చాలా మంది ప్రజలు, సైనికులు తమతో కలిశారని.. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని నార్తర్న్ అలయన్స్ వ్యవస్థాపకుడి కుమారుడు అహ్మద్​ మసూద్ హెచ్చరించారు. తన తండ్రి.. భారీగా ఆయుధాలు, మందుగుండు తయారుచేశారని, అవి ఇప్పుడు తమకు ఉపయోగపడతాయని చెప్పారు. తాలిబన్ల రాకతో.. తమ ప్రాంతానికి వందలాది ప్రజలు, సైనికులు వచ్చారని.. వారు కూడా యుద్ధానికి సిద్ధమని మసూద్​ వెల్లడించారు. అప్ఘాన్​లో శాంతియుత పరిస్థితులు నెలకొంటే.. తన తండ్రిని చంపిన తాలిబన్లను క్షమించడానికి సిద్ధమని మసూద్​ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చర్చలకు ఆస్కారం ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.

READ Panjshir : అప్ఘాన్ లకు అండగా  పంజ్ షిర్; ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు