ట్రంప్ కు వినూత్నంగా స్వాగతం చెప్పిన వంట మాస్టర్

  • Published By: chvmurthy ,Published On : February 24, 2020 / 10:55 AM IST
ట్రంప్ కు  వినూత్నంగా స్వాగతం చెప్పిన వంట మాస్టర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ఫిభ్రవరి 24 సోమవారం  కుటుంబ సమేతంగా 2 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. అహమ్మదాబాద్ లోని సర్దార్‌ వల్లాభాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్‌ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ట్రంప్ రాక సందర్భంగా అధికారులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.

ట్రంప్ పర్యటన పై దేశ ప్రజలంతా ఎంతో  ఆసక్తి కనబరుస్తున్నారు. చెన్నై కి చెందిన ఒక వంట మాస్టారు  ట్రంప్ కు వినూత్నరీతిలో స్వాగతం పలికాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఇనైవాన్ అనే  వంట మాస్టార్ ట్రంప్ మోడీ ముఖాకృతి కలిగిన రెండు పెద్ద ఇడ్లీలను తయారు చేసాడు. మరోక ఇడ్లీపై భారత్ అమెరికా జాతీయ పతాకాలను తీర్చి దిద్దాడు. 

ఈ  ఇడ్లీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిని ఆకట్టకుంటున్నాయి. . ఇనైవాన్ ఆరుగురు వ్యక్తుల సహాయంతో 36 గంటలపాటు శ్రమించి 107 కిలోల ఇడ్లీ పిండితో 3 పెద్ద ఇడ్లీలను తయారు చేశాడు.  ఇడ్లీలు ఉడికిన తర్వాత బయటకు తీసి వాటిపై ట్రంప్, మోడీ,  భారత్ అమెరికా జాతీయ పతాకాలను చిత్రీకరించాడు. 

అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్‌ కుటుంబానికి ప్రధాని మోడీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వీరుఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గోని సబర్మతీ ఆశ్రమాన్ని  చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.  సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్‌ దంపతులు ఇద్దరూ నేలపై కూర్చుని చరఖాపై నూలు వడికారు.

సబర్మతీ ఆశ్రమం నుంచి బయలు దేరి అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్  స్టేడియంని ప్రధాని మోడీతో కలిసి ప్రారంభించిన ట్రంప్…స్టేడియంలో హాజరైన 1లక్ష25వేల మందిని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి బయలు దేరి ట్రంప్  తాజ్ మహల్ సందర్సన కోసం ఆగ్రా చేరుకున్నారు.

trump modi idlies