టాంజానియా తొలి అధ్యక్షురాలిగా “సులుహు హాసన్”​ ప్రమాణస్వీకారం

టాంజానియాలో మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపట్టింది. సమియా సులుహు హాసన్​(61) ఈ ఘనత సాధించారు.

టాంజానియా తొలి అధ్యక్షురాలిగా “సులుహు హాసన్”​ ప్రమాణస్వీకారం

Samia Suluhu

Samia Suluhu టాంజానియాలో మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపట్టింది. సమియా సులుహు హాసన్​(61) ఈ ఘనత సాధించారు. 2015 నవంబర్ నుంచి టాంజానియా అధ్యక్షుడిగా కొనసాతున్న జాన్ మాగుఫ్లి అనారోగ్య కారణాలతో బుధవారం(మార్చి-17,2021) కన్నుమూసినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న సమియా సులుహు హస్సన్​(61) 6వ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

టాంజానియా దేశంలో అతిపెద్ద నగరం దార్​ ఈ-సలాంలో శుక్రవారం(మార్చి-18,2021) సమియా సులుహు హాసన్​ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. హిజాబ్​ ధరించి..కుడిచేతిలో ఖురాన్​ను పట్టుకుని తూర్పు ఆఫ్రికా దేశాల చీఫ్​ జస్టిస్​ సమక్షంలో దేశ రాజ్యాంగంపై సులుహు హాసన్​ ప్రమాణం చేశారు. అనంతరం మిలిటరీ పరేడ్​ను పరిశీలించారు. టాంజానియా మాజీ అధ్యక్షులు అలీ హసన్ మ్విని, జకాయ కిక్వేటే, అబీద్ కరుమె కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా నిబంధనల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

అయితే, జాన్ మాగుఫ్లి ఆకస్మిక మరణంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా సోకి గత వారమే ఆయన చనిపోయారని టాంజానియి ప్రతిపక్ష నేత తుండు లిస్సు పేర్కొన్నారు. కరోనా సోకడంతో విదేశాలకు ట్రీట్మెంట్ కోసం మాగ్లుపి వెళ్లారని కూడా చెబుతున్నారు. గత వారం ఓ కెన్యా వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని దీనికి ఆధారంగా చెబుతున్నారు. శ్వాసకోస సమస్య మరియు ఆకశ్మిక గుండె సమస్యతో మాగ్లుపి..మార్చి-8న మెడికల్ విమానంలో వచ్చి నైరోబీ హాస్పిటల్ లో చికిత్స పొందాడని,అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని,ట్రీట్మెంట్ కు ఆయన శరీరం సహకరించకపోవడంతో ఆయనను తిరిగి దార్ ఈ సలాంకి పంపించారని,గత గురువారమే ఆయన చనిపోయారని కెన్యా పత్రిక తన కథనంలో పేర్కొంది.