ఆ టీచర్ డ్రెస్సే ఓ పాఠం : విద్యార్ధులకు బాగా అర్థమయ్యేందుకు బాడీ సూట్

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 05:36 AM IST
ఆ టీచర్ డ్రెస్సే ఓ పాఠం : విద్యార్ధులకు బాగా అర్థమయ్యేందుకు బాడీ సూట్

టీచర్లలో ఈ టీచర్ వెరీ వెరీ స్పెషల్. విద్యార్దులకు తాను చెప్పే పాఠాలు బాగా అర్థం కావాలని ఆ టీచర్ తాపత్రాయం. అందుకోసం ఆమె వెరైటీ డ్రెస్ వేసుకుంటుంది. మరి ఆ  డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం. 

స్పానిష్‌కి చెందిన వెరోనికా 15 ఏళ్ల నుంచి టీచర్‌గా పని చేస్తున్నారు. 3వ క్లాస్ విద్యార్ధులకు ఆమె లెసన్స్ చెబుతారు. ఆ టీచర్ అంటే ఆ విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వెరోనికా టీచర్ చెప్పే అనాటమీ క్లాస్ (శరీర నిర్మాణ శాస్త్రం) చెప్పటానికి వస్తుందంటే చాలా విద్యార్ధులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ప్రాక్టికల్. ఆ పాఠం చెప్పేందుకు క్లాస్ కు వెళ్లటానికి బాడీ సూట్ ధరించి క్లాస్ వస్తారు వెరోనికా. 

ఆ సూట్ పై మానవ అంతర్గత అవయవాలు ప్రింట్ చేయబడి ఉంటాయి. వాటిని చూపిస్తు టీచర్ విద్యార్ధులకు పాఠం చెబుతారు. దీంతో శరీరంలో అవయవాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? అవి ఎలా పనిచేస్తాయి అంటూ ఆమె పిల్లలకు పాఠం చెబుతారు. 

దీంతో పిల్లలకు సులువుగా లెనన్ అర్థమవుతాయని ఆమె అంటారు. విద్యార్ధులు అనాటమీ క్లాస్ అంటే ఆసక్తి చూపటమే దానికి నిదర్శనం. ఈ సందర్భంగా వెరోనికా మాట్లాడుతూ విద్యార్థులు…అంతర్గత అవయవాలను(శరీరం లోపల ఉండే అవయవాలు) ఊహించుకోవడం చాలాకష్టమని..అందుకే తాను ఈ విధంగా పిల్లలకు పాఠాలు చెప్పటానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. 

వెరోనికా బాటీ సూట్  వేసుకుని క్లాస్ చెబుతున్నప్పుడు ఆమె భర్త కొన్ని ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు వెరోనికా ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు స్పందన భారీగా వస్తోంది. వేల కొద్దీ రీట్వీట్లు, 66 వేల లైక్‌లు వచ్చాయి.