Teachers’ Day : టీచర్స్ డే..ఏఏ దేశాల్లో ఏ తేదీల్లో జరుపుకుంటారో తెలుసా?

టీచర్స్ డే మన భారత్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5న జరుపుకుంటాం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డేను ఏఏ రోజున జరుపుకుంటారో తెలుసా?

Teachers’ Day : టీచర్స్ డే..ఏఏ దేశాల్లో ఏ తేదీల్లో జరుపుకుంటారో తెలుసా?

Teachers Day  (1)

Teachers’ Day Special : సెప్టెంబర్ 5. మనం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అంతేకాదు ఇదే రోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. ఈ ఉపాధ్యాయ దినోత్సవం లక్ష్యం ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను గౌరవించుకోవటం..వారి విద్య కోసం చేసిన కృషిని స్మరించుకోవటం. అలాగే విద్య అందరికీ అందేలా చేయటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించటం. దీనితో పాటు ఉపాధ్యాయులకు, విద్యాబోధనలకు సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి ఒక అవకాశంగా ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ లక్ష్యంలో భాగమే. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 5న ‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా జరుపుతారు. దాదాపు 100 దేశాల్లో జరిగే ఈ వేడుక గురించి విశేషాలేంటో తెలుసుకుందాం.అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏఏ దేశాల్లో ఏఏ తేదీల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం.

ఉపాధ్యాయుడు అంటే గురువు. కేవలం పాఠాలు చెప్పటమే కాదు మంచి చెడులను పిల్లలకు చెప్పేవాడు. గురువులు చెప్పే పాఠాల్లోంచి..వారు చెప్పే మంచి చెడుల్లోంచి విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు ప్రభావం విద్యార్ధులపై చాలా ఉంటుంది. గురువు చెప్పే పాఠాల్లోంచే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తొలి గురువు అమ్మే. కానీ తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం గురువే. ప్రతి ఒక్కరికి జీవితంలో స్ఫూర్తి నింపి, దిశా నిర్దేశం చేసేవాడు గురువంటే.

అందుకే మరి గురువులను పూజిస్తూ ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని దాదాపు 100 దేశాలు జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో 1994లో ఆక్టోబర్‌ 5వ తేదీని ‘వరల్డ్‌ టీచర్స్‌ డే’గా ప్రకటించింది. అప్పటినుంచి ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ ఉపాధ్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ఎంతోమంది గురువులు..అందరికి వేల వేల నమస్కారాలు..
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురువులున్నారు. అన్నె సలీవాన్‌, నాన్సీ ఎట్‌వెల్‌, హెలెన్‌ కెల్లెర్‌, అల్బర్స్‌ ఐన్‌స్టీన్‌, అరిస్టాటిల్‌, అయాన్‌ ర్యాండ్‌, గెలీలియో, న్యూటన్‌, పైథాగారస్‌, కన్‌ఫ్యూసియస్‌, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్టన్‌ వంటి ఎంతోమంది ఆదర్శంగా నిలిచారు. అలాగే మన పురాణాల్లో దక్షిణామూర్తి, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరుశురాముడు, ఆదిశంకరాచార్యులు, ద్రోణాచార్య, రామకృష్ణపరమహంస వంటి మహానుభావులు ఉన్నారు.

భారత్ లో టీచర్స్ డే
డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజు అంటే సెప్టెంబర్‌ 5న భారతీయులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

చైనాలో టీచర్స్ డే
కన్‌ఫ్యూసియస్‌ పుట్టినరోజైన ఆగస్టు 27న చైనీయులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతారు. తొలిసారిగా ప్రైవేటు పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తిగా కనుఫ్యూసియస్‌ పేరొందారు. అంతేకాదు తత్వవేత్తగా పేరుపొందిన కన్‌ఫ్యూసియస్‌ ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు.

మలేషియా,హాంకాంగ్, వియత్నాంలో
మలేషియాలో ‘హరిగురు’ పేరుతో మే 16న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు. వియత్నాంలో నవంబర్‌ 20న విద్యార్థులు ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పువ్వులిచ్చి గౌరవిస్తారు.హాంకాంగ్‌లో సెప్టెంబర్‌ 10న చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన జాన్‌ కొమినస్‌ ప్రపంచ ఆధునిక విద్యాపితామహునిగా పేరుపొందారు. ఆయన పుట్టిన రోజు అంటే మార్చి28న టీచర్స్‌ డే జరుపుతారు.

అల్బేనియాలో
అల్బేనియా దేశంలో 1867 మార్చి 7న మొదటి స్కూల్ ను స్థాపించి తొలి పాఠాలు బోధించారు. అందుకే అల్బేనియాలో మార్చి 7న ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటారు. యూఏఈ, సౌదీ ఆరేబియా, ఈజిప్ట్‌, సిరియా, అల్జీరియా దేశాల్లో ఫిబ్రవరి 28న ఇలా వివిధ దేశాల్లో ఆ తేదీల్లో ఉన్న ప్రాధాన్యతను బట్టి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు.

అలాగే అర్జెంటీనాలో సెప్టెంబర్ 11, ఆస్ట్రేలియాలో అక్టోబర్ ఆఖరు శుక్రవారం,బ్రెజిల్ అక్టోబర్ 15, చిలీ అక్టోబర్ 16,కొలంబియాలో మే 15,చెక్ రిపబ్లిక్ లో మార్చి 28, ఈక్వెడార్ ఏప్రిల్ 13,హాంకాంగ్ లో సెప్టెంబర్ 10,హంగేరి జూన్ మొదటి శనివారం, ఇండోనేషియ నవంబర్ 25, ఇరాన్ మే 2,జమైకా మే 6, లిథువేనియా అక్టోబర్ 5,లెబనాన్ మార్చి3, మలేషియాలో మే 16,మెక్సికో మే 15, మంగోలియా ఫిబ్రవరి మొదటి వారం అంతా, పాకిస్థాన్ అక్టోబర్ 5, పోలండు అక్టోబర్ 14, రష్యా అక్టోబర్ 5,సింగపూర్ సెప్టెంబర్ 1,దక్షిణ కొరియా మే 15, రిపబ్లిక్ ఆఫ్ చైనా సెప్టెంబర్ 28, థాయ్ లాండ్ జనవరి 16, టక్కీ నవంబర్ 24 ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

అలాగే ఒమన్, సిరియా, ఈజిప్టు, లిబియా, ఖతార్, బహ్రయిన్, యు.ఏ.ఇ., యెమన్, ట్యునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, మొరాకో దేశాలలో ఫిబ్రవరి 28న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.ఇలా పలు తేదీల్లో ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకుంటాయి. ఏరోజున జరుపుకున్నా ఉపాద్యాయ దినోత్సవం గురువులను గౌరవించుకోవటం. చదువు గొప్పదనాన్ని తెలియజేయటం.