టీచర్స్ డే స్పెషల్ : ఈ-కామర్స్ అలీబాబా అధినేత ప్రస్థానం 

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 06:00 AM IST
టీచర్స్ డే స్పెషల్ : ఈ-కామర్స్ అలీబాబా అధినేత ప్రస్థానం 

ఒకప్పటి పేద టీచర్..ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి. ఇది రాత్రికి రాత్రి వచ్చింది కాదు. పట్టుదల..కృషికి ప్రతిఫలం. ఏదైనా సాధించాలనే కసి..దాని కోసం నిరంతరం అన్వేషణ. ఏం చేయాలి అనే ఆలోచన..దానికి ఫలితం దక్కించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త జాక్ మా. పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాడా గ్రూప్ అధినేత జాక్ మా. జాక్  ఆన్‌లైన్ బ్యాంకు చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇస్తూ నిశ్శబ్ద విప్లవం సాధిస్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా సరిగ్గా అందని రుణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది జాక్ మా ఆన్‌లైన్ బ్యాంక్.

వ్యాపారస్తుడు ఎప్పుడూ ముందుచూపు కలిగి ఉండాలి. రానున్న కాలంలో ఏది ట్రెండ్ గా మారుతుంది. కష్టమర్లకు ఏది అవసం..కష్టమర్ల ఆలోచనావిధానం ఎలా ఉంటుందని ఎప్పుడూ అంచనా వేస్తుండాలి. దానికి తగినట్లుగా తన వ్యాపారాన్ని మలచుకోవాలి..అంటే వ్యాపారస్తుడు ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండాలి. ఆన్ లైన్ వ్యాపారంగా మారుతున్న కాలాన్ని తనకు అనుగుణంగా మారుకున్నారు జాక్ మా. సక్సెస్ కు మారు పేరుగా నిలిచారు.ఒకప్పటి టీచర్.ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి. సెప్టెంబర్ 3 టీచర్స్ డే సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా సక్సెస్ స్టోరీ వ్యాపార ప్రస్థానం గురించి.. 

పట్టుదల కృషి ఉంటే సాధించలేనదంటూ ఏదీ లేదని అనుభవజ్నులు చెప్పిన మాటలు నిజం చేసివారిలో జాక్ మా కూడా ఒకరు. ఒకప్పటి పేద టీచర్ ఈనాడు కోట్లకు అధిపతి అయ్యారు. ప్రపచం కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. 1980లో ఓ సాధారణ స్కూల్ టీచర్ గా జాక్ మా పనిచేశారు.కానీ ఏదో సాధించాలనే తపనతో టీచర్ ఉద్యోగం మానేశారు. అనువాద అనే ఓ సంస్థను స్థాపించారు.

ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు మ్యాథ్స్ లో 120 మార్కులకు ఒకే ఒక్క మార్కు వచ్చింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి వెళ్లిన జాక్ మా కేఎఫ్‌సీ సహా పలు కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లారు. అలా జాక్ మా వెళ్లిన 30 ఇంటర్వ్యూల్లో జాక్ మాను తిరస్కరణకు గురయ్యారు. నువ్వు ఉద్యోగానికి పనికిరావు అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడు నిరాశ చెందలేదు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఏదైనా సాధించి తీరాలనే ప్రయత్నాన్ని మాత్రం మానలేదు. 

అలా అతని అన్వేషణలో భాగంగా..1994లో ఓసారి కంపెనీ పనిమీద అమెరికాకు వెళ్లారు. అదే అప్పుడే జాక్ మాకు కంప్యూటర్ గురించి తెలుసుకున్నారు. ఇక అంతా దీని యుగమేనని నిర్ణయానికి వచ్చారు. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ మాది జాక్ మాకు కంప్యూటర్ సైన్స్ లో మంచి పట్టున్న వ్యక్తులు. జాక్ మా కూడా కంప్యూటర్ తో అన్నీ అని నమ్మారు. కంప్యూటర్ సైన్స్ లో మంచి పట్టు సాధించారు. 

ఏదోకటి సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్న జాక్ మా 17మంది ఫ్రెండ్స్ తో కలిసి 1997 ఫిబ్రవరి 21న అలాబాబా సంస్థను ప్రారంభించారు.  అలా ఆయన వ్యాపార ప్రస్థానం ప్రారంభై ఈనాడు చైనాలో నెంబర్ వన్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగారు జాక్ మా. ఇప్పుడు జాక్ మా రూ.2.36 కోట్లకు అధిపతి అయ్యారు. అయినా నిరంతరం తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తునే ఉంటారు.