Xiaomi Cars : ఇక షావోమీ నుంచి చౌక కార్లు..! 2024లో విడుదల

తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన టెక్ దిగ్గజం షావోమీ ఆ తర్వాత ఇతర ఉత్పత్తులనూ తీసుకొచ్చింది. టీవీలు, ల్యాప్ టాప్ లు, ఆడియో ఉత్పత్తులు.

Xiaomi Cars : ఇక షావోమీ నుంచి చౌక కార్లు..! 2024లో విడుదల

Xiaomi Cars

Xiaomi Cars : తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన టెక్ దిగ్గజం షావోమీ ఆ తర్వాత ఇతర ఉత్పత్తులనూ తీసుకొచ్చింది. టీవీలు, ల్యాప్ టాప్ లు, ఆడియో ఉత్పత్తులు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, లైట్లు ఇలా ఎన్నింటినో తీసుకొచ్చింది. వ్యాపారాన్ని మరింత పెంచుకుంది.

Warm Water : గోరు వెచ్చని నీళ్లు తాగితే మేలే..!

ఇప్పుడు షావోమీ మరో అడుగేసింది. ఇక కార్ల మార్కెట్లోనూ పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను సంస్థ సీఈవో లీజున్ ధ్రువీకరించారు. షావోమీ తన మొదటి కారును 2024లో విడుదల చేస్తుందని ప్రకటించారు. ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు షావోమీ ఈ ఏడాది మొదట్లో ఒక ప్రకటన చేసింది. కానీ, ఎప్పుడు తీసుకురానున్నదీ స్పష్టం చేయలేదు. తాజాగా సంస్థ సీఈవో ఈ విషయాన్ని బయటపెట్టారు.

Reduce Stress : ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..

10వేల మందికి పైగా నిపుణులు, ఇంజనీర్లు కార్ల అభివృద్ధి కోసం పని చేస్తున్నట్టు లీజున్ తెలిపారు. అయినా స్మార్ట్ ఫోన్లు తమ ప్రధాన వ్యాపారంగా ఇక మీదటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్ల ప్రాజెక్టుపై షావోమీ 10 బిలియన్ డాలర్లను (రూ.75వేల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. వార్షికంగా 3 లక్షల
ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలన్నది సంస్థ ప్రణాళిక.