Sreve Kirsch ‘Mask’ Offer : మాస్క్ తీస్తే రూ.82 లక్షలు ఇస్తానని పారిశ్రామికవేత్త ఆఫర్ .. ‘తీసేదేలే’దని తెగేసి చెప్పిన యువతి

ఫేస్ మాస్క్ తీస్తే రూ.82 లక్షలు ఇస్తానని పారిశ్రామికవేత్త ఓ యువతికి ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె తీసేదేలేదని తేల్చి చెప్పింది. దీంతో సదరు పారిశ్రామిక వేత్త..

Sreve Kirsch ‘Mask’ Offer : మాస్క్ తీస్తే రూ.82 లక్షలు ఇస్తానని పారిశ్రామికవేత్త ఆఫర్ .. ‘తీసేదేలే’దని తెగేసి చెప్పిన యువతి

Sreve Kirsch ‘Mask’ Offer

Sreve Kirsch ‘Mask’ Offer : ‘మాస్క్’అంటూ ఠక్కున గుర్తుకొస్తుంది ‘కరోనా’. ఈ మహమ్మారి సమయంలో ‘మాస్క్’ తప్పనిసరిగా అయ్యింది. ‘మాస్క్’ ధరించకపోతే జరిమానాలు విధించిన పరిస్థితి వచ్చింది. దీంతో ‘మాస్క్’ముఖంలో భాగమైపోయింది. ‘మాస్క్’ పెట్టుకోండీ..మమ్మల్నీ, మీ కుటుంబాన్ని కాపాడుకోండీ అనే నినాదాలు కరోనా సమయంలో నినాదాలుగా మారాయి.‘మాస్క్’ధరించటంలో ఓ బాధ్యతగా మారింది. కానీ ఓ పారిశ్రామిక వేత్త మాత్రం ‘మాస్క్’తీసేస్తే రూ.85 లక్షలు గిఫ్ట్ గా ఇస్తానంటూ ఓ యువతికి ఆఫర్ చేశారు. కానీ ఆ యువతి మాత్రం మీరు ఎంత ఇచ్చినా ‘మాస్క్’ తీయనని తేల్చి చెప్పింది..‘మాస్క్’ తీస్తే భారీ ఆఫర్ ఇచ్చిన ఆ పారిశ్రామిక వేత్త ఎవరు? .‘తీసేదేలే’దన్నఆ యువతి ఎవరు? ఎందుకు తీయను అని చెప్పిందో చూద్దాం..

టెక్ దిగ్గజం..అమెరికన్ పారిశ్రామికవేత్త, స్టీవ్ కిర్చ్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన సహ ప్రయాణికురాలు మాస్క్ ధరించి ఉండటాన్ని చూశారు. అలా ఆమె ‘మాస్క్’ ధరించి అస్సలు తీయకుండా ఉండటాన్ని గుర్తించారు. దీంతో స్టీవ్ కు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ఒక్కసారి మీ ‘మాస్క్’ తీయండీ అని కోరారు స్టీవ్. దానికి సదరు యువతి ‘తీయను’ అని స్పష్టంగా చెప్పింది. దానికి స్టీవ్ మీరు ఒక్కసారి ‘మాస్క్’తీస్తే 100 డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దానికి ఆమె వింతగా చూసి .‘తీసేదేలే’దు అని తేల్చి చెప్పింది. దీంతో స్టీవ్ అయ్యారు. తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితికి సంబంధించిన వివరాలను స్టీవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా స్టీవ్ పోస్ట్ లో ‘‘నేను డెల్టా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. ఒక మహిళ నా పక్కన కూర్చుంది. ఆమె మాస్క్ ధరించింది. ఇంకా మాస్క్ అవసరం లేదని..తీసేయొచ్చు కదా అని చెప్పాను. దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు ఇచ్చినా ఆమె అంగీకరించలేదు ఆమె దృఢ నిర్ణయం ముందు నా ఆఫర్లన్నీ విఫలమయ్యాయి.’’ అని చెప్పుకొచ్చారు.. అదేనండీ రాసుకొచ్చారు ఇన్ స్టాలో స్టీవ్..

స్టీవ్ మొదట ఆమెకు 100 డాలర్లతో ఆఫర్‌ను ప్రారంభించి అలా అలా పెంచుకుంటూ పోతూ డు. అయినప్పటికీ ఆమె మాస్క్ తీసేందుకు అంగీకరించలేదు. అలా అతను ఆఫర్ అమౌంట్‌ను పెంచుతూనే ఉన్నాడు. చివరికి 100,000 డాలర్ల ఆఫర్ (రూ. 82 లక్షలు) ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. కానీ.. విమానంలో బ్రేక్ ఫాస్ట్ సమయం అవ్వటంతో సిబ్బంది ఫుడ్ అందించగా అప్పుడు ఆమె తినటానికి తన మాస్క్ తీయాల్సి వచ్చింది అంటూ తెలిపారు. సదరు యువతి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోందని తెలిపారు.