ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు..మూగ జీవులను రక్షించిన టీనేజర్లు

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 10:08 AM IST
ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు..మూగ జీవులను రక్షించిన టీనేజర్లు

ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చుకు కోట్లాది మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. మరెన్నో ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. ఇటువంటివాటిని రక్షించేందుకు జంతు డాక్టర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. మూగజీవాలను రక్షించేందుకు ప్రభుత్వ అధికారులు చేయగలిగనంతా చేస్తున్నారు. మూగ జీవాలకు ఈ సాయం సరిపోవట్లేదు. మంటలకు బలైన మూగ జీవాల సంఖ్య 480 మిలియన్లకు పైగా ఉంటుందని అధికార గణాకాలే చెబుతున్నాయి. ఈ దుర్ఘటన గురించి ప్రజలు చలించిపోతున్నారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. 

కళ్లముందు జరుగుతున్న ఈ ఘోరకలిని చూసిన మీకా (19)కాలేబ్ (18)అనే ఇద్దరు టీనేజర్లు గుండెలవిసేలా ఏడ్చారు. అలా ఏడ్చినవారు ఊరికినే ఉండలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇంట్లో ఉన్న కారు తీసుకుని అడవిలోకి వెళ్లారు. వీలైనన్ని కువాలాలను(టెడ్డీ బేర్‌లా ఉండే జంతువులు) కారులోకి ఎక్కించుకున్నారు.

కారు నుండి వాటిని నింపి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దృశ్యాల్ని వారి కజిన్ ఒకరు సోషల్ మీడియాలో పంచుకకోవటంతో వయస్సులో చిన్నవారైనా పెద్ద మనస్సు కనబరిచారని ఆ  టీనేజర్లను నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తున్నారు.