Faking COVID-19 Positive: నిమ్మరసంతో కొవిడ్ రిజల్ట్ మార్చేస్తున్న టీనేజర్లు

స్కూల్స్ కు బంక్ కొట్టడానికి జ్వరం, తలనొప్పి అనే రోజుల నుంచి కొవిడ్ వచ్చిందని చెప్పే స్టేజ్ కు వచ్చేశారు పిల్లలు. యూట్యూబ్ లాంటి మీడియాలో కరోనా మహమ్మారికి

Faking COVID-19 Positive: నిమ్మరసంతో కొవిడ్ రిజల్ట్ మార్చేస్తున్న టీనేజర్లు

Covid Fake Result

Faking COVID-19 Positive: స్కూల్స్ కు బంక్ కొట్టడానికి జ్వరం, తలనొప్పి అనే రోజుల నుంచి కొవిడ్ వచ్చిందని చెప్పే స్టేజ్ కు వచ్చేశారు పిల్లలు. యూట్యూబ్ లాంటి మీడియాలో కరోనా మహమ్మారికి మందు అంటూ ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు మాత్రం టిక్‌టాక్ లో వీడియోలు చూసి కొవిడ్ రిజల్ట్ నే మార్చేస్తున్నారు. ఇటువంటి చర్యలు చేయకూడదంటూ విద్యాసంఘాలు పిల్లలకు హెచ్చరికలు జారీ చేశాయంటేనే చెప్పుకోవచ్చు అక్కడ ఈ టెక్నిక్ ఎంత ట్రెండ్ అయిందో..

యూకేలోని స్థానిక మీడియా కథనం ప్రకారం.. టిక్ టాక్ లో కొవిడ్ పాజిటివ్ టెస్టు వచ్చేలా ఫేక్ గా క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. నిమ్మరసంతో పాటు మరి కొన్ని లిక్విడ్లు కలిపి కొవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా చేస్తున్నారు. అలా ఏ ఒక్క వీడియోనో కాదు.. బోలెడ్ వీడియోలు ఇదే ఇష్యూపై చక్కర్లు కొడుతుంటే వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

#fakecovidtest హ్యాష్ ట్యాగ్ తో చేసిన ఒక వీడియోకు.. 65లక్షల వ్యూస్ వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ యూజర్లు లెమన్ జ్యూస్, యాపిల్ శాస్, కోకా కోలా, వెనిగర్, శానిటైజర్ లు కలిపి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులపై అప్లై చేస్తున్నారు. ఈ ఐడియా మొత్తం కొవిడ్ రిజల్ట్ చూపించి స్కూల్ ఎగ్గొట్టడానికే.

దీనిపై టిక్‌టాక్ అధికార ప్రతినిధి రెస్పాండ్ అయ్యారు. అటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలను వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు.