AirPods free Covid-19 vaccine: వ్యాక్సిన్ వేయించుకునే టీనేజర్లకు యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫ్రీ..

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంది. వ్యాక్సినేషన్ కోసం డోసులు దొరకడం లేదని కొన్ని రాష్ట్రాలు మొత్తుకుంటుంటే.. మిగిలిన ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకునేవారే కరువయ్యారు. ఇక్కడే కాదు అమెరికాలోనూ అదే పరిస్థితట. బేసిక్ గా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. వాషింగ్టన్ గవర్నమెంట్ ఖరీదైన గిఫ్ట్ లు ఇస్తే గానీ లొంగరని ఈ పని చేసింది.

AirPods free Covid-19 vaccine: వ్యాక్సిన్ వేయించుకునే టీనేజర్లకు యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫ్రీ..

Covid 19 Vaccine

AirPods free Covid-19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంది. వ్యాక్సినేషన్ కోసం డోసులు దొరకడం లేదని కొన్ని రాష్ట్రాలు మొత్తుకుంటుంటే.. మిగిలిన ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకునేవారే కరువయ్యారు. ఇక్కడే కాదు అమెరికాలోనూ అదే పరిస్థితట. బేసిక్ గా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. వాషింగ్టన్ గవర్నమెంట్ ఖరీదైన గిఫ్ట్ లు ఇస్తే గానీ లొంగరని ఈ పని చేసింది.

వాషింగ్టన్ మేయర్.. Muriel Bowser వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కోసం వచ్చే వారికి యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు పాతిక వేల డాలర్ల స్కాలర్‌షిప్ కూడా పొందే అవకాశం ఉందట. ట్వీట్ లో సదరు విషయాన్ని ప్రకటించారు మేయర్.

‘ఇవాల్టి ఉదయం 10గంటల నుంచి.. వాషింగ్టన్ డీసీలో ఉండే (12-17)ఏళ్ల మధ్య వయస్కులు బ్రూక్లాండ్ ఎమ్ఎస్, సౌసా ఎమ్ఎస్, జాన్సన్ ఎమ్ఎస్ బ్రాంచ్ లలో వ్యాక్సినే వేసుకోవడానికి వెళ్తే యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉచితంగా పొందొచ్చు లేదా పాతిక వేల డాలర్ల స్కాలర్‌షిప్ పొందే అవకాశమైన ఉంది.’ అని ట్వీట్ చేశారు.

వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లేటప్పుడు టీనేజర్లు వారి పేరెంట్ ను గానీ, గార్డియన్ ను గానీ తీసుకెళ్లాలి. ఈ ప్రైజ్ క్లెయిమ్ చేసుకోవడానికి స్కూల్ ఐడీ, లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డ్ లాంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒక్కొక్కరికీ ఒక్క గిఫ్ట్ కార్డ్ మాత్రమే ఇస్తారు.

వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయగలం. వ్యాక్సినేషన్ వల్ల ఏ వ్యక్తి కరోనా వ్యాప్తికి గురి కాలేదని తెలుసుకోవాలి. హాస్పిటలైజ్ అయ్యే శాతం కూడా తక్కువే. వాషింగ్టన్ మాత్రమే కాదు. ఇతర అమెరికా రాష్ట్రాలైన మ్యారీలాండ్, మిచిగాన్, ఓహియోలు కూడా వ్యాక్సిన్ వేసుకునేవారికి రివార్డులు ప్రకటిస్తున్నాయి.