Temple in Australia: ఆస్ట్రేలియాలో మరో దేవాలయం ధ్వంసం.. వారంలో రెండో ఘటన

భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమిక అంచనా.

Temple in Australia: ఆస్ట్రేలియాలో మరో దేవాలయం ధ్వంసం.. వారంలో రెండో ఘటన

Temple in Australia: ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయం ధ్వంసమైంది. విక్టోరియా ప్రాంతంలోని, క్యారమ్ డౌన్స్ వద్ద ఉన్న శ్రీ శివ విష్ణు దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం ధ్వంసం చేశారు. అంతేకాదు.. దేవాలయం పరిసరాల్లో ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ ఆర్ట్ కూడా చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమిక అంచనా. అయితే, ఆస్ట్రేలియాలో ఇలా దేవాలయం ధ్వంసం కావడం వారంలో ఇది రెండోసారి. ఈ నెల 12న మెల్‌బోర్న్‌లోని స్వామి నారాయణ్ దేవాలయాన్ని కూడా కొందరు ధ్వంసం చేశారు. అక్కడ కూడా యాంటీ ఇండియా గ్రాఫిటీని చిత్రీకరించారు. ఇదంతా అసాంఘిక శక్తుల పనే అని తెలుస్తోంది. ఖలిస్తానీ మద్దతుదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.

Rohit Sharma: వరల్డ్ కప్‌ కోసం బలమైన జట్టు తయారు చేయడమే లక్ష్యం: భారత కెప్టెన్ రోహిత్ శర్మ

కాగా, విక్టోరియాలో తాజాగా దేవాలయం ధ్వంసం కావడంపై స్థానిక ఎంపీ బ్రాడ్ బాటిన్ స్పందించారు. ‘‘విక్టోరియాలో కానీ.. ఆస్ట్రేలియాలో కానీ ఇలాంటి విధ్వంసకర ఘటనలకు తావు లేదు. ఈ ప్రాంతం బహుళ సాంస్కృతికతత్వానికి నిలయం. అంటే ఒకరితో కలిసి ఒకరు పనిచేయడమే. అంతేకానీ.. ఒకరికి పోటీగా ఇంకొకరు ఉండటం కాదు’’ అని బ్రాడ్ బాటిన్ అన్నారు. తాజా ఘటనలపై అక్కడి హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దేవాలయాలు స్వేచ్ఛ, సమానత్వం, సేవలకు ప్రతీకలు అని ఆస్ట్రేలియాలోని స్వామినారాయణ్ సంస్థ తెలిపింది. ఈ ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.